Site icon Prime9

Avatar 2 : రికార్డుల మోత మోగిస్తున్న అవతార్ 2… 12 రోజుల్లోనే 8,200 కోట్ల కలెక్షన్స్

avatar 2 movie crossing one billion collection mark

avatar 2 movie crossing one billion collection mark

Avatar 2 : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విజువల్ వండర్ “అవతార్” ది వే ఆఫ్ వాటర్. 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా… పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అవతార్ 2 విడుదలైన రెండు వారాలు పూర్తికావోస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంది.

ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బిలియన్ డాలర్లను (రూ.8,200 కోట్లు) వసూలు చేసింది. బిలియన్ డాలర్లలో 300 మిలియన్ డాలర్లు ఒక్క నార్త్ అమెరికాలో వసూలు కాగా, మిగిలిన 700 మిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా వసూలైంది. మన దేశంలోనూ ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాపై బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ.16,400 కోట్లు ఆదాయం రావాలని జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న టాక్ ని చూస్తే కొద్ది రోజుల్లోనే ఆ టార్గెట్ చేరుకుంటుంది అని చెప్పవచ్చు. ఈ మేరకు ప్రముఖ మూవీ ఎనలిస్ట్ చేసినట్టు రమేశ్ బాల అవతార్ 2 కలెక్షన్స్ గురించి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.

Exit mobile version