Movie Theatre : త్వరలోనే ప్రారంభం కానున్న నందమూరి ఫ్యామిలీ థియేటర్ … బాలయ్య చేతుల మీదుగా !

Movie Theatre : ప్రస్తుత కాలంలో సినిమా తారలంతా కేవలం నటన మాత్రమే కాకుండా పలు బిజినెస్ ల లోనూ రాణిస్తున్నారు. మహేష్ బాబు, నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు సినిమాల్లో రాణిస్తూనే వారి అభిరుచికి తగ్గట్టుగా పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ లో

  • Written By:
  • Updated On - December 12, 2022 / 10:50 AM IST

Movie Theatre : ప్రస్తుత కాలంలో సినిమా తారలంతా కేవలం నటన మాత్రమే కాకుండా పలు బిజినెస్ ల లోనూ రాణిస్తున్నారు. మహేష్ బాబు, నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు సినిమాల్లో రాణిస్తూనే వారి అభిరుచికి తగ్గట్టుగా పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ లో రాణిస్తుండగా, మహేష్ బాబు ఇటీవలే నమ్రతా పేరు మీద ఒక హోటల్ ని ప్రారంభించారు. మరో వైపు ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్ లో ఒక మల్టీప్లెక్స్ ని కూడా కొనసాగిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా పలు బిజినెస్ లు రన్ చేస్తూ సినిమాల్లో కూడా అగ్ర హీరో గా దూసుకుపోతున్నారు. మహేష్ బాబుతో పాటే విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఆసియన్ మల్టిప్లెక్స్ గ్రూప్ తో కలిసి మల్టిప్లెక్స్ థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు.

కాగా ఇప్పుడు హైదరాబాద్ లో నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఓ థియేటర్ ఉంది. నగరం లోని కాచిగూడలో తారకరామ అనే ఒక పాత థియేటర్ ఉంది. చాలా ఏళ్లుగా ఈ థియేటర్ ని ఎన్టీఆర్ పేరు మీద నందమూరి ఫ్యామిలీ నడిపిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ థియేటర్ మూతబడే స్టేజికి వచ్చేసింది. దీంతో నందమూరి ఫ్యామిలీ ఆసియన్ గ్రూప్ తో కలిసి దీనిని రీ మోడలింగ్ చేసి మల్టిప్లెక్స్ లా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ థియేటర్ డిసెంబర్ 14న బాలకృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెన్ కానుందని తెలుస్తుంది. ” ఆసియన్ తారకరామ ” పేరుతో ఈ థియేటర్ స్టార్ట్ చేయనున్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలయ్యతో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఈ థియేటర్ ని రీమోడల్ చేయగా… 4కే ప్రొజెక్షన్‌, సుపీరియర్‌ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. డిసెంబర్ 16న రిలీజయ్యే అవతార్ సినిమాతో ఈ థియేటర్ లో స్క్రీనింగ్ మొదలుపెట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.