Site icon Prime9

Arjun Tendulkar: ముంబై జట్టును వదిలి గోవా జట్టులో చేరిన అర్జున్ టెండూల్కర్

Mumbai: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టునుంచి బయటకు వచ్చి గోవా జట్టలో చేరాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ గత ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున రెండు T20లు ఆడాడు.

గత సీజన్‌లో జట్టులోకి వచ్చిన తర్వాత అర్జున్ కు రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం లభించకపోవడంతో అర్జున్ ముంబై క్రికెట్ అసోసియేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అర్జున్ భారత్ అండర్-19 జట్టు తరపున శ్రీలంక పై రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. కుమార్ కార్తికేయ మరియు డెవాల్డ్ బ్రీవిస్ వంటి వారితో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ డెవలప్‌మెంటల్ స్క్వాడ్‌లో కూడా ఉన్నాడు.

గోవా క్రికెట్ అసోసియేషన్ (జిసిఎ) అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ మాట్లాడుతూ, అర్జున్ టెండూల్కర్‌ను రాష్ట్ర ప్రీ-సీజన్ ప్రాబబుల్స్‌లో వుంచుతామని తెలిపారు. మేము ఎడమ చేతి బౌలర్ల కోసం చూస్తున్నాము. అదే సమయంలో బహుళ నైపుణ్యాలతో మిడిల్ ఆర్డర్‌ఆటగాళ్లను కూడా చేర్చుకుంటాము. అందుకే అర్జున్ టెండూల్కర్‌ను గోవా జట్టులో చేరమని ఆహ్వానించామని లోట్లికర్ చెప్పారు.

Exit mobile version