Site icon Prime9

AR Rahman: విరిగిన మనసులు మళ్లీ అతుక్కోలేవు – విడాకులపై ఏఆర్ రెహమాన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

AR Rahman Emotional Post on Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రెహమాన్‌కు విడాకులు ఇస్తున్నట్టు ఆయన భార్య సైరా బాను తన తరపు లాయర్‌ ద్వారా ప్రకటన ఇచ్చారు. సైరా బాను తన భర్త ఏఆర్‌ రెహమాన్‌తో విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని, వారి వైవాహిక బంధంతో తలెత్తిన భావోద్వేగ గాయం కారణంగానే ఆమె భర్తతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పడానికి సిద్ధమైనట్టు పేర్కొన్నారు.

ఈ క్రమంలో విడాకులపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భార్య ఇచ్చిన ఈ ప్రకటన ఆనంతరం కొన్ని గంటల్లోనే రెహమాన్‌ కూడా విడాకుల ప్రకటన చేశారు. ఈ మేరకు తన ట్విటర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. “త్వరలోనే మా వైవాహిక జీవితం 30 వసంతాలు పూర్తి చేసుకుంటుందని ఆనందించాం. కానీ అనుకోని పరిస్థితుల్లో అది జరగలేదు. 29 ఏళ్ల మా వివాహ జీవితానికి ముగింపు పలుకుతున్నామని అసలు ఊహించలేదు. విరిగిన హృదయాల బరువు దైవ నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పగిలిన మనసులు మళ్లీ అతుక్కోలేవు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్టుగా ఇచ్చిన స్నేహితులు, సన్నిహితులకు ధన్యవాదాలు. అలాగే మా వ్యక్తిగత ప్రైవసీని గౌరవిస్తారని అర్థం చేసుకుంటున్నాం” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక వీరి విడాకులపై రెహమాన్‌ దంపతులు పిల్లలు కూడా స్పందించారు. “మా తల్లిదండ్రుల విడాకులు విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికి ధన్యవాదాలని వారి పెద్ద కూతురు రహీమా ట్వీట్‌ చేసింది. అలాగే ఖతీజా, అమీన్‌లు కూడా “ఈ కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతిఒక్కరిని వేడుకుంటున్నామని, తమని అర్థం చేసుకుని, ప్రైవసీని గౌరవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

నవంబర్ 19న సాయంత్రం రెహమాన్ భార్య విడాకుల గురించి ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందేజ ఆమె న్యాయవాది వందనా షా ద్వారా ఆమె ఈ ప్రకటన చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా మానసిక బాధకు గురైన తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే 29 ఏండ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారని, వైవాహిక జీవితంలో తగిలిన భావోద్వేగ గాయం కారణాంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటన పేర్కొన్నారు. అదే విధంగా ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, దంపతుల మధ్య తలెత్తిన అనూహ్య పరిస్థితులు ఇద్దరినీ మధ్య దూరం పెంచాయని, అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని సైరా బాను ప్రకటనలో వెల్లడించారు. కాగా 1995లో రెహనమాన్‌, సైరా బాను పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదర్చిన వివాహం. వీరికి ముగ్గురు సంతానం కాగా ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దాదాపు 29 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన ఈ జంట అనూహ్యంగా విడాకుల ప్రకటన చేయడంలో అంతా షాక్ అవుతున్నారు.

Exit mobile version