Site icon Prime9

AR Rahman: విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు

AR Rahman and Saira Banu Divorce: ఆస్కార్‌ అవార్డు గ్రహిత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ మేరకు ఆయన భార్య సైరా బాను అనూహ్యంగా విడాకులు ప్రకటన ఇచ్చారు. వీరిద్దరి తరపున ప్రముఖ లాయర్‌ వందనా షా విడాకులు ప్రకటన ఇచ్చారు. సైరా బానుకు ఇది కఠిన నిర్ణయమని, ఎంతో బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కష్ట సమయాల్లో వారి ప్రైవపీకి గౌరవం ఇవ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు షాక్‌ అవుతున్నారు.

మూడు దశాబ్దాల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఏఆర్‌ రెహమాన్‌, సైరా బానులు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. భావోద్వేగపూరిత ఒత్తిడి వల్లే వీరి బంధంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరు ఈ కఠిన నిర్ణయానికి వచ్చారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల వల్ల వారి మధ్య అధిగమించలేని దురాన్నిసృష్టించాయి” అని ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద సెలబ్రిటీ అయిన తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. ఆయన పిల్లలు, భార్య సైరా బాను కానీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చింది లేదు. ఏదైన ఫంక్షన్‌లో కనిపించిన భార్యతో అన్యోన్యంగా కనిపించే వారు. అలాంటి ఈ జంట ఆకస్మాత్తుగా విడిపోవడాన్ని సన్నిహిత వర్గాల జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా రెహమాన్‌, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లై 29 ఏళ్లు అవుతుంది. ఇలా మూడు దశాబ్దాలుగా కలిసున్న వీరు విడాకులు తీసుకుని విడిపోవడం ఇది కఠిన నిర్ణయమే అని చెప్పాలి. కాగా వీరిద్దరిక ముగ్గురుసంతానం. ఖతీజా, రహిమా ఆడిపల్లతో పాటు అమీన్ అనే కొడుకు ఉన్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం.

Exit mobile version