Site icon Prime9

AP Highcourt : కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ సర్కారుకి షాక్ ఇచ్చిన హైకోర్టు.. విచారణ ఈ నెల 20కి వాయిదా..

ap highcourt judegement on harirama jogaiah petition on kapu reservation

ap highcourt judegement on harirama jogaiah petition on kapu reservation

AP Highcourt : కాపు, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటీషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.

ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ… చేగొండి హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ వ్యాజ్యంలో ఈడబ్ల్యూఎస్‌ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజకీయ కుట్ర అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు.

కాపులు ఆర్ధికంగా నేటికి వెనుకబడి ఉన్నారన్నారు.

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు లభిస్తే ఆర్ధికంగా బలోపేతం అవుతారని భావిస్తున్నందునే రిజర్వేషన్లను జగన్ సర్కార్ వ్యతిరేకిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

 

పిటిషన్ ని ఈ నెల 20 కి వాయిదా వేసిన హైకోర్టు..

ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింది 5 శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని గత ఏడాది డిసెంబర్ లో చేగొండి హరిరామజోగయ్య సీఎం జగన్ ను కోరారు.

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో హరిరామజోగయ్య ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు.

అయితే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

అలాగే 86 ఏళ్ల వయసులో ఆమరణ దీక్షకు దిగడంపై పవన్ కల్యాణ్ తో సహా, ఆయన సన్నిహితులు దీక్షపై పునరాలోచించాలని కోరారు.

అనంతరం జోగయ్య దీక్ష విరమించారు. అయితే కాపు రిజర్వేషన్లపై తన ప్రాణం పోయేవరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

 

తాజాగా ఆయన రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించారు.

అయితే, వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

వ్యాజ్యానికి నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు.

దీంతో సీఎం జగన్‌ని ప్రతివాదిగా తొలగిస్తామని జోగయ్య తరపు న్యాయవాది వెల్లడించండంతో కేసు ముందుకు వెళ్లింది.

అయితే న్యాయ పరంగా ప్రకారం దక్కవలసిన 5 శాతం రిజర్వేషన్లు దక్కకుండా ముఖ్యమంత్రి జగన్ అడ్డుకుంటున్నారని వాజ్యంలో పేర్కొన్నారు.

రిజర్వేషన్ కల్పిస్తే రాయలసీమలో బలిజలు రాజకీయంగా తమ కులస్థుల ఎదుగుదలకు అడ్డు వస్తారనే 5 శాతం రిజర్వేషన్ కల్పించకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు.

2019 ఎన్నికలలో కాపు రిజర్వేషన్ కు తమ మద్దతు అని అధికారంలోకి వచ్చాక 5 శాతం రిజర్వేషన్ దక్కకుండా చేస్తున్నారని.. కాపు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉన్న జీవో నెం 65,66 లను రద్దు చేయాలని హై కోర్టులో పిటీషన్ దాఖలు.

ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version