AP Govt Serious on Peddireddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు.
మొత్తం 75 ఎకరాల అటవీ ప్రాంతానికి చెందిన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందించారు. ఈ విషయంపై ఇవాళ ఏపీ సచివాలయంలో రెవన్యూ శాఖపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఇందులో పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములు, ఆగడాలు భూ మాఫియా వంటి విషయాలపై చర్చించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సబ్మిట్ చేుయాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించారు. ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ, అడవుల ధ్వంసపై తదితర వాటిపై విచారించాలన్నారు. అలాగే రికార్డులో అవకతవకలు, రికార్డులో తారుమారు, లబ్దిదారుల వివరాలు తేల్చాలని చెప్పారు.