Site icon Prime9

AndhraPradesh: 6నెలల్లో రూ.51608 కోట్లు అప్పుగా తెచ్చిన ఏపీ ప్రభుత్వం

AP government has borrowed Rs. 51608 crores in 6 months

AP government has borrowed Rs. 51608 crores in 6 months

AP Government: సంక్షేమ పేరిట వేలకోట్లను అప్పులుగా తీసుకొని రావడం రాష్ట్రాలకు పరిపాటిగా మారింది. ఆంక్షలు అంటూనే కేంద్రం కూడా రాష్ట్రాల తెచ్చుకొంటున్న అప్పులకు మంజూరు అవకాశాలు కల్పిస్తుంది. రాజకీయ ధోరణిలో సాగుతున్న అప్పుల పరంపర ఏనాటికైనా ఇబ్బందులు తెస్తుందని వాదిస్తున్న ఆర్ధిక నిపుణుల మాటలను పలు రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం గత 6నెలల కాలంలో తెచ్చిన అప్పులు రూ. 51608 కోట్లకు చేరింది.

ఏపీ ప్రభుత్వం నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు బాండ్ల వేలంలో ఈ మేరకు రాష్ట్రానికి అప్పు ముట్టింది. 7.82 శాతం వడ్డీతో వెయ్యి కోట్లను 13 సంవత్సరాల్లో చెల్లించేలా, 7.74 శాతం వడ్డీతో వెయ్యి కోట్లను 20 సంవత్సరాలకు చెల్లించేలా ఏపీ ప్రభుత్వం రుణం తీసుకొనింది. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి ఏపీ ప్రభుత్వం అప్పులు తెస్తుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక క్రమ శిక్షణ ఉల్లాంఘనాలకు దారి తీయడంపై కేంద్రం మౌనంగా ఉండడం పట్ల మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత భారీగా లక్షల కోట్లలో అప్పులు తెస్తూ అభివృద్ధి కోసమేనంటూ రాజకీయం చేయడాన్ని ప్రజలు నిశతంగా గమనిస్తున్నారు.

ఇది కూడా చదవండి: CM Jagan: చిన్నారికి అరుదైన వ్యాధి.. కోటి రూపాయలు ఇచ్చిన సీఎం జగన్

Exit mobile version