Site icon Prime9

AP Global Investors Summit 2023 : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో నోరూరించే వంటకాల మెనూ ఇదే..!

AP Global Investors Summit 2023 food menu details

AP Global Investors Summit 2023 food menu details

AP Global Investors Summit 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖపట్నం వేదికగా “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు. ఆ సమయంలో వేదికపై సీఎం జగన్, ముఖేష్ అంబానీతో పాటు, కరణ్ ఆదానీ, జీఎంఆర్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి అతిథులు విచ్చేశారు. వీరికి నోరూరించే వంటకాలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది.

మొదటి రోజు మెనూ (AP Global Investors Summit 2023)..

ఈరోజు మధ్యాహ్నం భోజనంలో గుంటూరు కోడి వేపుడు, బొమ్మిడాయల పులుసు, మటన్ కర్రీ, రొయ్యల మసాలా, చికెన్ పలావ్, వెజ్ పలావ్, క్యాబేజీ ఫ్రై, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాప్సికం కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, కుల్చా, మిర్చీ కా సలాన్, మెంతికూర-కార్న్ రైస్, టమోటా పప్పు, బీట్ రూట్ రసం, గోబీ ఆవకాయ, మజ్జిగ పులుసు, ద్రాక్ష పండ్ల పచ్చడి, నెయ్యి, వడియాలతో పాటు ఐస్ క్రీమ్, కాలా జూమూన్, జున్ను, ఫ్రూట్స్ ఉంటాయి.

రెండో రోజు మెనూ..

రెండో రోజు అయిన రేపు కూడా నోరూరించే వంటకాలు అతిథుల కోసం సిద్ధం కాబోతున్నాయి. రేపటి మెనూలో ఆంధ్ర చికెన్ కర్రీ, చేప ఫ్రై, రొయ్యల కూర, మటన్ పలావ్, ఎగ్ మసాలా, గోంగూర మటన్, రుమాలీ రోటీ, బటర్ నాన్, రష్యన్ సలాడ్స్ ఉంటాయి. వెజ్ సెక్షన్ లో కడాయ్ వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, పన్నీర్ కర్రీ, బెండకాయ-జీడిపప్పు ఫ్రై, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు ఉంటాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, అంగూర్ బాసుంది, డబుల్ కా మీఠా అందుబాటులో ఉంటాయి.

 

ఉదయం టిఫిన్ విషయానికి వస్తే… హాట్ పొంగల్, టమోటా బాత్, ఇడ్లీ, వడ ఉంటాయి. ఉదయం స్నాక్స్ లో డ్రై కేక్, ప్లమ్ కేక్, వెజ్ బెల్లెట్, స్ఫ్రింగ్ రోల్స్, మఫిన్స్ ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ లో చీజ్ బాల్స్, కుకీస్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, బజ్జీలు, కాఫీ, టీ ఉంటాయి.

ఈరోజు కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎంవోయూ కార్యక్రమం ఉంటుంది. అనంతరం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగం ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపన్యాయం చేస్తారు. అనంతరం ప్రముఖులను సన్మానిస్తారు. సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలిరోజు ముగుస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version