Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ఏరియల్ నేడు వరదప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రానున్న 24 నుంచి 48 గంటల్లో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ సహా బేసిన్‌లోని అన్ని రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు విడుదల ఆవుతున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.