Ap Cm Jagan : ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. నార్పల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజిక వర్గాన్నే మారుస్తుంది. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం. చదువుల వల్ల ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం.
Ap Cm Jagan : జగనన్న వసతి దీవెన పథకం నిధులు రిలీజ్ చేస్తున్న సీఎం జగన్.. చదువు ఒక కుటుంబ చరిత్రనే మారుస్తుందంటూ.. లైవ్

ap cm jagan programme at ananthapuram live