Site icon Prime9

Ghati Glimpse: అనుష్క ఘాటీ గ్లింప్స్ వచ్చేసింది – నెవర్‌ బీఫోర్‌ లుక్‌లో షాకిచ్చిన ‘జేజమ్మ’

Anushka Ghati Glimpse Out: ‘ది క్వీన్‌’ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రియేటివ్‌ డైరెక్ట్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఘాటీ’. ఇటీవల ఈ సినిమాను ప్రకటించింది మూవీ టీం. మిస్ట్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత వస్తున్న చిత్రమిది కావడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇవాళ(డిసెంబర్‌ 7) అనుష్క బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేసింది మూవీ టీం. అంతేకాదు ఫస్ట్‌ గ్లింప్స్‌ని సాయంత్రం విడుదల చేస్తున్నట్టు అప్‌డేట్ ఇచ్చింది. చెప్పినట్టుగానే తాజాగా మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

47 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌లో అనుష్క నెవర్ బీఫోర్‌ లుక్‌లో దర్శనం ఇచ్చింది. కత్తిపట్టి విలన్లపై విరుచుకుపడింది. తలలు కోసేస్తూ ఊచకోత చేసింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ మూవీపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇందులో అనుష్క పెళ్లయిన పవర్ఫుల్‌ మహిళ పాత్రలో కనిపించనుంది. ఇందులో అనుష్క మాస్‌ లుక్‌లో అదరగొట్టింది. ఇందులో ఆమె యాక్షన్‌ ఎలివేషన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. మొత్తానికి ఘాటీ ఫస్ట్‌ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ ఆకట్టుకుటుంది. ఇక ఇందులో అనుష్క లుక్‌, పర్ఫామెన్స్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

ఇప్పటికే క్రిష్‌, అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదం’ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న మరో చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుంది. అతిత్వరలోనే ఈ సినిమాలో ఇతర నటీనటుల వివరాలను కూడా మూవీ టీం ప్రకటించనుంది.

Exit mobile version