Site icon Prime9

Ghaati First Look: రక్తంతో నిండిన చేతులు, సిగరెట్‌ తాగుతున్న అనుష్క – ఆసక్తి పెంచుతున్న ‘ఘాటీ’ ఫస్ట్‌లుక్‌

Anushka Shetty Ghaati Firts Look: అనుష్క శెట్టి ఇటీవల ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమా తర్వాత స్వీటీ చేస్తున్న చిత్రం ‘ఘాటీ’. డ్రైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ప్రకటించిన మూవీ టీం ఇవాళ అనుష్క శెట్టి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేసింది. నవంబర్‌ 7 అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ మూవీ టీం ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఘాటీలో అనుష్క లుక్‌ పోస్టర్‌ షేర్‌ చేస్తూ తన పాత్రను పరిచయం చేసింది. లేడీ ఒరియంటెడ్‌గా వస్తున్న ఈ సినిమాలో అనుష్క పవర్ఫుల్‌ ఉమెన్‌ పాత్రలో కనిపించనుందని ఈ ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. అలాగే అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ రోజు సాయంత్రం మూవీ ఫస్ట్ గ్లాంప్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది టీం.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనుష్క.నుదుట రక్తం, చేతికి రక్తంతో సిగార్‌ తాగుతూ కనిపిచింది. ఇందులో అనుష్క కళ్లలో కోపం, క్రోధంతో అనుష్క సీరియస్‌లో లుక్‌లో కనిపిచింది. ‘విక్టిమ్‌, క్రిమినల్‌, లెజెండ్‌’ అని ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ క్యాప్షన్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. చూస్తుంటే ఇదోక క్రైం, థ్రిల్లర్‌ చిత్రంలా అనిపిస్తోంది. మరి ‘విక్టిమ్‌, క్రిమినల్‌, లెజెండ్‌’ అర్థమేంటో తెలియాలంటే మూవీ రిలీజ్‌ వరకు ఆగాల్సిందే. కాగా ఇప్పటికే క్రిష్‌, అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన వేదం మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న మరో చిత్రమిది. దీంతో ఈ సినిమా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Exit mobile version