Andhra Pradesh Ticket Rate and Benefit Shows GO Released for Ram Charan Game Changer: గ్లోబల్ స్టార్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీకి సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ ‘గేమ్ ఛేంజర్’లో హీరోయిన్‌గా కియారా అడ్వాణీ నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, పిక్స్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా, ఈ సినిమా నుంచి ఓ మంచి గుడ్ న్యూస్ అందింది. ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించగా.. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.134కు పెంచారు. మల్టీప్లెక్స్ టికెట్‌కు అదనంగా రూ.175 వరకు పెంచుకునేందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 10 నుంచి 23 వరకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.
అర్ధరాత్రి 1 గంటలకు వేసే ప్రీమియర్ షో టికెట్ ధరను అన్ని ట్యాక్స్‌లు కలిపి రూ. 600గా నిర్ణయించింది. మొదటి రోజు ఆరు షోలు ఉండగా.. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు సైతం అనుమతి అలభించింది.
ఇక, ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగనే ఈనెల 10వ తేదీన ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ సర్కులర్ జారీ చేసింది. ఆ తర్వాత జనవరి 11 నుంచి 23 వ తేదీ వరకు ఈ ధరలతోనే ఐదు షోలకు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, తెలంగాణలో బెనిఫిట్ షోకు సంబంధించిన విషయంపై స్పష్టత రాలేదు. ఇటీవల సంధ్య థియేటర్ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.