Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్‌పై సీఎం సమీక్షించనున్నారు.
ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను పరిశీలించారు. ప్రాజెక్టు వెనుక నుంచి నిలిపే ప్రాంతం కాగా, డ్యాం నిర్మించాలంటే పైన మరో డ్యాం నిర్మించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈసీఆర్ఎఫ్ డ్యాంతో పాటు ప్రధాన డ్యాం రెండు ఒకేచోట నిర్మించాల్సి ఉంటుంది.
రెండు డ్యాంలు నిర్మించేందుకు ఇసుక సాంద్రత ఎక్కువగా ఉంది. దాదాపు 300మీటర్ల లోపల డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో వాటర్ ను డైవర్ట్ చేసి ప్రధాన డ్యాం నిర్మిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు డైవర్ట్ చేసే నిర్మాణ పనులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే రెండు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఏడాది కాలం పట్టనుందని సమాచారం. ఇందులో భాగంగానే హిల్ వ్యూ పాయింట్ నుంచి చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే పోలవరం గ్యాప్ 1 పనులను సైతం పరిశీలించారు.
అంతకుముందు వ్యాూ పాయింట్ నుంచి చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను పరిశీలించారు. ఈ మేరకు అధికారులను ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నిర్మాణానికి ఎంత ఖర్చువుతుందని అధికారులను ప్రశ్నించారు. దీంతో దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, పోలవరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితులపై పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సీఎం సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో ప్రాజెక్టు పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే విషయాలపై షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా, అంతకుముందు జూన్ 17న తొలిసారి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. తాజాగా, మరోసారి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.