Site icon Prime9

Anchor Suma : ఇక యాంకరింగ్ కి గుడ్ బై అంటున్న సుమ… కారణం అదేనా?

anchor suma shocking comments about quit anchoring

anchor suma shocking comments about quit anchoring

Anchor Suma : తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబంలో అందరవ్వవ సుమ కి ఫ్యాన్స్ గా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ. కాగా సీరియల్స్ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సుమ… దాదాపు 15 ఏళ్లుగా తన యాంకరింగ్ తో అలరిస్తుంది.

తన మాటలతో, తన పంచులతో… సినిమా ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు లోనూ సుమ అదరగొడుతుంది. పేరుకి మలయాళీ అయినప్పటికీ తెలుగింటి అమ్మాయి లాగా ప్రజలను మెప్పిస్తుంది. ప్రస్తుతం సుమ డేట్స్ కోసం పెద్ద హీరోలు కూడా ముందే బుక్ చేసుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. అయితే తాజాగా ఆమె అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది సుమ. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ… ఇక యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది.

ఈటీవీ ఛానల్ లో న్యూ ఇయర్ కి టెలికాస్ట్ కానున్న ఓ స్పెషల్ ప్రోగ్రాంలో సుమ పాల్గొంది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమోని యూనిట్ విడుదల చేశారు. దీంట్లో సుమకి మిగిలిన ఆర్టిస్టులంతా కలిసి సన్మానం చేశారు. సన్మానంలో సుమ మాట్లాడుతూ… మళయాళీగా పుట్టిన నేను తెలుగులో ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి తెలుగు ప్రజలే కారణం కానీ ప్రస్తుతానికి నేను కొంత విరామం తీసుకుంటున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అసలు సుమ యాంకరింగ్ కి ఎందుకు బ్రేక్ ఇస్తుంది? కారణాలు ఏంటి అని? అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అడుగుతూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఈ విషయం గురించి సుమ స్పందించే వరకు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version