Allu Ayaan: ప్రౌడ్‌ ఆఫ్‌ యూ నాన్న – తండ్రి కోసం అల్లు అయాన్ లేఖ, ఎమోషలైన బన్నీ

  • Written By:
  • Updated On - December 5, 2024 / 06:23 PM IST

Allu Arjun Gets Emotional Ayaan Letter: పుష్ప 2 రిలీజ్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ తన కొడుకు అయాన్‌ రాసిన లేఖను షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అంతేకాదు జీవితంలో అన్నికంటే ఇది అతిపెద్ద విజయం అంటూ తండ్రిగా మురిసిపోయాడు. ఏ లేటర్‌ ఫ్రం ప్రౌడ్‌ సన్‌ అంటూ అయాన్‌ తన తండ్రి అల్లు అర్జున్‌కి ఓ లేఖ రాశాడు. ఐయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ నాన్న అంటూ అయాన్‌ తన చిట్టి చేతులో ఎమోషనల్ నోట్‌ రాశాడు.

“మీ సక్సెస్‌ పట్ల నేను ఎంత గర్వంగా ఫీల్‌ అవుతున్నానో చెప్పేందుకే ఈ లెటర్‌ రాస్తున్నా నాన్న. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా నాలో మిక్స్‌డ్‌ ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ మొదలయ్యాయి. పుష్ప 2 సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న నిబద్ధతని తెలియజేస్తుంది. నా జీవితంలో ఎప్పటికీ నువ్వే నా హీరో నాన్న. నీకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని” అని రాసుకొచ్చాడు. అంతేకాదు చివరిలో పుష్ప అంటే ప్లవర్‌ అనుకున్నావా.. కాదు వైల్డ్‌ ఫైర్ అని తండ్రి డైలాగ్ రాసుకొచ్చాడు. అలాగే ది ప్రౌడెస్ట్‌ సన్‌ ఆఫ్ ఇన్‌ ద వరల్డ్‌ అంటూ అయాన్‌ తన తండ్రిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఇక కొడుకు రాసిన లేఖను అల్లు అర్జున్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. అంతేకాదు అయాన్‌ చిన్న పిల్లాడు రాసిన లేఖ కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం అయాన్‌ రాసిన లేఖ నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి. జీవితంలో గెలిచావ్‌. ‘ఒక మంచి కొడుకుగా గెలిచావ్‌. సొంత ఫ్యామిలీలో గెలిచావ్‌. ఇప్పుడు బెస్ట్‌ డాడీ అనిపించుకున్నావ్‌ ఇంతకంటే ఏం కావాలి ‘ అంటూ ఓ అభిమాని బన్నీపై ప్రశంసలు కురిపించాడు. కాగా అల్లు అర్జున్‌కి తన కొడుకు అయాన్‌ అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. కూతురి కంటే కూడా అయాన్‌తోనే తనకు ఎక్కువ బాండ్‌ అని ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పాడు. రీసెంట్‌గా అన్‌స్టాపబుల్‌ షోలోనూ అయాన్‌కు తనపై ఎంత ఇష్టమో యానిమల్‌ సినిమాలోని రణ్‌బీర్‌ కపూర్‌ పాత్రలో పోల్చి చెప్పాడు. అయాన్‌ యానిమల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌లా.. వాళ్ల నాన్న కోసం ఏమైనా చేస్తాడు అంటూ కొడుకు ప్రేమ గురించి చెబుతూ మురిసిపోయాడు.