Site icon Prime9

Pushpa 2: మళ్లీ ‘పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ మారింది – పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌! కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..

Pushpa 2 New Release Date

Pushpa: The Rise New Release Date: అనుకున్నదే నిజమైంది. అసలు డిసెంబర్‌ 6న ‘పుష్ప: ది రూల్‌’ వచ్చేది నిజమేనా? అని మొదటి నుంచి ఎన్నో సందేహలు ఉన్నాయి. ఇక అందరి ఊహాగానాలను నిజం చేస్తూ మరోసారి ‘పుష్ప 2’ వాయిదా పడింది. అయితే ఈసారి మూవీ వెనక్కి వెళ్లలేదు. ముందుకు వచ్చింది. ప్రకటించిన డేట్‌ కంటే ముందే ‘పుష్ప 2’ను రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా దీనిపై మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది టీం.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే ఫస్ట్‌ పార్ట్‌ విడుదల కాగా బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డ్స్‌ సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్‌ జరుపుకుంటుంది. పార్ట్‌ 2 సెట్స్‌పైకి వచ్చి రెండేళ్లు అవుతుంది. కానీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. రిలీజ్‌ డేట్‌ను కూడా తరచూ వాయిదా వేసుకుంటూ వస్తోంది.

మొదట స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న రిలీజ్‌ చేస్తున్నట్టు చెప్పారు. కానీ సడెన్‌గా మూవీని వాయిదా వేసి డిసెంబర్‌ 6కి కొత్త డేట్‌ ప్రకటించారు. మరోసారి మూవీని రిలీజ్‌ని మార్చేస్తూ ప్రీ-షెడ్యూల్‌ చేశారు. చెప్పిన డేట్‌ కంటే ఒకరోజు ముందే సినిమాను థియేటర్లోకి తీసుకువస్తున్నారు. డిసెంబర్‌ 6న కాకుండ.. డిసెంబర్‌ 5న మూవీని రిలీజ్‌ చేస్తూ ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా బన్నీ కొత్త లుక్‌ని వదిలారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్‌ హీరో ఫహద్‌ ఫాజిల్‌ పోలీసు ఆఫీసర్‌గా నెగిటివ్ షేడ్‌లో కనిపించబోతున్నారు. సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేష్‌ వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

రిలీజ్‌కు ముందే రూ. 1000 కోట్ల బిజినెస్‌

దేశంలో ఏ సినిమాకు లేని క్రేజ్‌ పుష్ప చిత్రానికి ఉందనడంలో సందేహం లేదు. దీనికి ఉదాహరణ ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలే. విడుదలకు ముందే ‘పుష్ప 2’ ఎవరూ ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దాదాపు రూ. 1000 కోట్లు జరిగినట్టు ట్రేడ్‌ వర్గాల అంచన వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ ఏ చిత్రం కూడా ఈ రేంజ్‌లో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను జరుపుకోలేదు. రాజమౌళి బాహుబలి మాత్రమే రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను జరుపుకుంది. ఇంతవరకు ఏ పాన్‌ ఇండియా చిత్రం బాహుబలిని చేరుకోలేకపోయాయి. ఇప్పుడు పుష్ప 2 మాత్రమే బాహుబలితో పోటీ పడిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. మరి రీలీజ్‌కు ఇలాంటి రేర్‌ రికార్డును అందుకు పుష్ప… ఇక విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి!

Exit mobile version