Site icon Prime9

Pushpa 2: అల్లు అర్జున్‌ పుష్ప 2 – పీలింగ్‌ సాంగ్‌ ప్రొమో రిలీజ్‌

Pushpa 2 Peeling Song

Pushpa 2 Peeling Song Promo: పుష్ప 2 రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే ఉంది. దీంతో ప్రమోషన్స్‌ జోరు పెంచింది మూవీ టీం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ఐటెం సాంగ్ విపరీతమైన బజ్‌ పెంచాయి. తాజాగా మేకర్స్‌ మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే కిస్సిక్‌ సాంగ్‌లో శ్రీలీలతో పుష్పరాజ్ మాస్‌ డ్యాన్స్‌ జాతర చూపించారు. క్‌ సాంగ్‌ రిలీజ్ చేశారు. తాజాగా శ్రీవల్లితో పుష్ప రాజ్‌ రొమాన్స్‌ చూపించబోతున్నారు.’పీలింగ్స్‌’ అంటూ సాగే పాట ప్రొమోను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఫుల్‌ సాంగ్‌ డిసెంబర్‌ 1న రిలీజ్‌ చేయనున్నట్టు మూవీ టీం తెలిపింది.

అయితే ఈ పాట లిరిక్స్‌ మలయాళంలో ఉండటం విశేషం. అన్ని భాషల్లోనూ ఈ పాట మలయాళంలోనే ఉండనుందని కొచ్చి ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమించిలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. రష్మక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్, జగపతి బాబు, సునీల్‌, యాంకర్‌ అనసూయ, రావు రమేష్‌ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version