Site icon Prime9

Allari Naresh: ‘బచ్చల మల్లి’ టీజర్‌ వచ్చేసింది – మాస్‌ యాక్షన్‌తో విశ్వరూపం చూపించిన అల్లరోడు

Bachala Malli Teaser Release: ట్యాలెంటెడ్‌ హీరో అల్లరి నరేష్‌ ఈ మధ్య కామెడీ జానర్లు పక్కన పెట్టి సీరియస్‌, యాక్షన్‌ చిత్రాలతో అలరిస్తున్నారు. నాంది, ఇల్లు మారేడిమిల్లి, ఉగ్రం వంటి చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ కొట్టాడు. ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ట్రాక్‌ ఎక్కాడు. ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. దీంతో మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి దిగి ‘బచ్చల మల్లి’ సినిమాతో రెడీ అయ్యాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేం సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌ పతాకంపై బాలాజీ గుత్తా, రాజేష్‌ దండలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో హనుమాన్‌ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ 20న థియేటర్లో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో నరేష్‌ రగ్గడ్‌ అండ్‌ రస్టిక్‌ లుక్‌లో మాస్‌ అవతారంలో దర్శనం ఇచ్చాడు. హీరోహీరోయిన్‌ల మధ్య సీన్‌తో టీజర్‌ మొదలైంది. హీరోయిన్‌ ప్రభుత్వ ఉద్యోగి కాగా.. ఊర్లో పనిపాట లేకుండా తిరిగే మాస్‌ అబ్బాయిగా నరేష్‌ కనిపించనున్నాడని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

నేరుగా హీరోయిన్‌తోనే కావేరీ నీతో మాట్లాడంటూ నరేష్‌ హీరోయిన్‌తో మాట్లాడే సీన్‌తో టీజర్‌ మొదలైంది. కావేరి కావేరి అంటూ హీరోయిన్‌ వెంట పడుతూ కనిపించాడు. నాకు సిగరేట్‌, మందు అలవాటు ఉంది అలాగే అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉందంటూ నేరుగా హీరోయిన్‌తోనే అంటాడు. అలా యాక్షన్‌, లవ్‌, ఎమోషన్స్‌తో ఆద్యాంతం ఆసక్తిగా సాగింది ఈ టీజర్‌.ఇందులో అల్లరి నరేష్‌ యాక్టింగ్‌, పర్పామెన్స్‌ మూవీపై అంచనాలు పెంచుతుంది. చూస్తుంటే నాంది లాగే బచ్చల మల్లితో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేలా ఉన్నాడు నరేష్‌. మరి థియేటర్లో వచ్చాక ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్‌ని మెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version