Maha Sivaratri In Srisailam : శ్రీశైలంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

మహా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది. ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - February 12, 2023 / 09:41 AM IST

Maha Sivaratri In Srisailam : మహా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది.

ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఇవాళ్టి నుంచి 21 వరకు సాగే ఉత్సవాల కోసం సర్వం సిద్ధమైంది.

మొదటి రోజు స్వామివార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున కాళహస్తి ఈవో విజయసాగర్ బాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

 

రాజగోపురం వద్ద వాయిద్యాల నడుమ దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో ఎస్.లవన్నఘనంగా స్వాగతం పలికారు. అలాగే శ్రీస్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. నేటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. దేవతా మూర్తుల విగ్రహాలకు కొత్త హంగులు అద్దారు.

(Maha Sivaratri In Srisailam) భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

భక్తులు భారీగా తరలి వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాల దారి మళ్లించినట్టు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 17నుండి 19 వరకు విజయవాడకు వెళ్లవలసిన భారీ వాహనాల కర్నూలు లోని నంద్యాల చెక్ పోస్ట్, ఆత్మకూరు, దోర్నాల , విజయవాడ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశామని ఎస్పీ రఘువీర్ రెడ్డి వెల్లడించారు. భారీ వాహనదారులు కర్నూలు లోని నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుందని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి రానుండడంతో దేవస్థానం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తోంది. స్వామి దర్శనానికి భక్తులు ఐదురోజుల ముందు నుంచే పాదయాత్ర ప్రారంభించి శ్రీశైలం చేరుకుంటారు. ఇక్కడికి 10 కిలోమీటర్లు దూరంలోని కైలాస ద్వారం మెట్ల మార్గంలోని వచ్చే భక్తుల కోసం భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. ఇవాళ యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం ధజారోహణ ఘట్టం ఉంటుంది. రేపటి నుంచి వరుసగా భృంగి, హంస, మయూర, రావణ, పుష్పపల్లకీ, గజ, వాహనసేవలు ఉంటాయి.

18 వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రభల ఉత్సవం, నంది వాహనసేవ, రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

19వ తేదీన అమ్మవారి రధోత్సవం, తెప్పోత్సవం ఉంటాయి.

21వ తేదీతో ఉత్సవాలు ముగియనున్నాయి…

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/