Site icon Prime9

Ajay Devgn: 10 ఏళ్ల తర్వాత విడుదల అవుతున్న అజయ్‌ దేవగన్ మూవీ

Naam Movie Releasing After 10 years: ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రతి వారం బాక్సాఫీసు వద్ద ఎన్నో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే అందులో అప్‌కమ్మింగ్‌, చిన్న సినిమాలు అయితే లెక్కెలేదు. కొన్ని షూటింగ్‌ పూర్తైన విడుదల కోసం ఏళ్ల పాటు ఎదురుచూస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ సినిమా కూడా ఒకటి. పదేళ్ల క్రితం ఆయన నటించిన చిత్రం ‘నామ్‌’. డైరెక్టర్‌ అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ మూవీని రూంగ్ట ఎంటర్‌టైన్‌మెంట్ స్నిగ్ధ మూవీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్లపై అనిల్‌ రూంగ్ట నిర్మించారు. భూమిక చావ్లా, సమీరా రెడ్డిలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పదేళ్ల తర్వాత విడుదలకు నోచుకుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన షాకిచ్చింది మూవీ టీం. నవంబర్‌ 22న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు. అజయ్-అజ్మీర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం నాలుగోవది. నిజానికి 2014లోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. కానీ నిర్మాతల్లో ఒకరు మరణించడంతో మూవీ విడుదల ఆగిపోయిందట. ఆ తర్వాత డిస్ట్రీబ్యూటర్లు దొరకపోవటంతో మూవీ విడుదల ఆగిపోయింది. మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన సందర్భంగా చిత్ర యూనిట్‌ మాట్లాడుతూ.. ఎన్నో అడ్డుంకులను దాటుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar