Actress Sri Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అమ్మడికి వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తుండటంతో, శ్రీలీల యంగ్ సెన్సేషన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ బ్యూటీ పర్ఫార్మెన్స్‌కు అందరూ ఇంప్రెస్ కావడటంతో, వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు శ్రీలీలను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకుంటుండగా, సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ మూవీలోనూ శ్రీలీల నటిస్తుందనే టాక్ వినిపిస్తూ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 108వ చిత్రంగా వస్తుండగా, ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా తాజాగా ఈ సినిమాలో శ్రీలీల అడుగుపెట్టినట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల (Actress Sri Leela)..
ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో ఈ బ్యూటీ నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, బాలయ్య ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తాడని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలానే నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, కన్నడ మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో కూడా నటిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/