Priyanka Mohan Clarifies on Her Marriage Rumours: తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ హీరో అయినా ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్న జయం రవి ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విడాకులు తీసుకుని వైవాహికి జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. కానీ ఇదంతా తన ప్రమేయం లేకుండానే జరిగిందంటూ జయం రవి భార్య ఆర్తి వాపోయింది. ఇలా విడాకులు విషయం బయటకు రావడం, దానికి అతడి భార్య ఆర్తి విభేదించడం ఇలా వివాదం నడుస్తుంది.
ఈ తరుణంలో జయం రవి.. నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆరుళ్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఒక్కసారి వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు సీక్రెట్ వీరి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారంటూ ఇద్దరు పూల దండలు వేసుకుని ఉన్న ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. పెళ్లయి, విడాకులైన వ్యక్తితో ప్రియాంక పెళ్లి చేసుకోవడమేంటని ఇండస్ట్రీలో అంతా గుసగులాడుకుంటున్నారు. అంతేకాదు ఆమె పెళ్లిపై మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జయం రవితో తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది ప్రియాంక. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ విషయంలో స్పందించింది.
“ఆ ఫోటో నిజమే. మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగడం కూడా నిజమే. కానీ అది బయట కాదు. సినిమాలో. జయం రవితో నేను బ్రదర్ అనే సినిమా చేశాను. ఇందులో మేమిద్దరం కపుల్స్. ఈ చిత్రంలో మా ఇద్దరికి పెళ్లి కూడా అవుతుంది. అందులో భాగంగా తీసిన సీన్స్‌లోని స్టిల్స్ అవి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో నిజంగానే అందరు మాకు నిశ్చితార్థం జరిగింది అనుకుని పొరపాటు పడుతున్నారు. ఆ ఫోటో బయటకు రావడంతో టాలీవుడ్ నుంచి నాకు వరుసగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు.
అందరు నాకు విషస్ తెలుపుతున్నారు. ఎందుకు అడగడంతో అసలు విషయం తెలిసిందే. నేను ఇతర సినిమాల షూటింగ్స్‌తో ఉండటం వల్ల ఇది ఆలస్యంగా నాదృష్టికి వచ్చింది. ఇక నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్న వారికి అసలు విషయం చెప్పాను. కానీ, మూవీ టీంని మాత్రం రిలీజ్ చేయడానికి ఈ ఫోటో తప్పితే మరో ఫోటో దొరకలేదా అని మనసులో తిట్టుకున్నా” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సంఘటన మాత్రం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది. కాగా ప్రస్తుతం ప్రియాంక మోహన్ తెలుగులో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇక తెలుగులో చివరిగా ఆమె నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంలో అలరిచింది.