Site icon Prime9

Nithya Menon : నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. ఎందుకంటే ?

actress nithya menon grand mother passes away

actress nithya menon grand mother passes away

Nithya Menon : తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగులో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, గీతా గోవిందం, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. నిత్యా మీనన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతే కాకుండా ఇప్పటి వరకు నిత్యామీనన్ ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది

ఇది ఇలా ఉంటే..  తాజాగా ఈ హీరోయిన్ ఇంట విషాదం నెలకుందని తెలుస్తుంది. నిత్యా.. అమ్మమ్మ చనిపోయారు. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. దాంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో.. ఎంతగానో ప్రేమించే తన అమ్మమ్మ చనిపోయారు. ఈమె కంటే ముందు నిత్యా తన తాతయ్యని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు తనతో లేరు అన్న విషయాన్ని నిత్యామీనన్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఆ బాధతో తన ఇన్‌స్టాలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. “ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా” అంటూ పోస్ట్ వేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక నిత్యామీనన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే రెండు వెబ్ సిరీస్ ని రెడీ చేస్తుంది. అలాగే తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) లో జడ్జిగా చేస్తూ వస్తుంది.

 

 

Exit mobile version