Geetha Singh : ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ పెద్ద కుమారుడు మరణించాడు అని తెలుస్తుంది. ఈ విషయాన్ని మరో నటి కరాటే కళ్యాణి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ‘పిల్లలూ.. కారులో అయినా బైక్‌పై అయినా జాగ్రత్తగా వెళ్లండి. కమెడియన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓం శాంతి’ అని ఆమె పోస్ట్ షేర్ చేశారు.
పెళ్లి కాకుండానే వారికి తల్లి అయిన గీతా సింగ్ (Geetha Singh)..
ఈ ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా కర్ణాటక రాష్ట్రంలో యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. అభిమానులు, నెటిజన్లు గీతా ఫ్యామిలీకి ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే గీతాసింగ్ కు ఇంకా పెళ్లి కాలేదు. తన తోడబుట్టిన అన్న మరణించడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను ఆమె తీసుకున్నారు. వారితో పాటు మారో పాపను కూడా ఆమె పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తన జీవితంలో ఈ ముగ్గురు పిల్లలే తనకు జీవితమని.. తనకు ఇంకెవ్వరూ లేరని గీతాసింగ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
‘ఎవడిగోల వాడిది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈమె.. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 50కు పైగా సినిమాల్లో నటించారు. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి గీతా దూరమైంది. ఆ మధ్య జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేశారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొని తన చేదు అనుభవాలను పంచుకున్నారు. అంతే కాదు.. సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తిని కొందరు వ్యక్తులను నమ్మి పోగొట్టుకున్నానని వాపోయారు గీతాసింగ్. దాంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఆర్ధికంగా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ఈ విషాద వార్తతో గీతా సింగ్ కోలుకోలేని బాధలో ఉన్నారని తెలుస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/