Site icon Prime9

Pavitranaresh: 2023కి లిప్ కిస్ తో వెల్ కమ్ చెబుతున్న నరేష్- పవిత్ర … మీ బ్లెస్సింగ్స్ కావాలంటూ..!

actor vk naresh post on social media about relationship with pavitra

actor vk naresh post on social media about relationship with pavitra

Pavitranaresh : ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ విజయనిర్మల గారి తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నరేష్… పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి హిట్ లను అందుకున్నారు. ఇక ప్రస్తుతం తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్… తన మూడో భార్యతో వీడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంతో సినీ వర్గాల్లో వీరిద్దరి విషయం హాట్ టాపిక్ గా నడిచింది. ఇటీవల నరేష్, పవిత్రా లోకేశ్ హోటల్ గదిలో ఉన్నప్పుడు… ఆయన మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫుల్ గా రచ్చ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన అనంతరం జరిగిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఈ తరుణం లోనే కొత్త ఏడాదిని కొత్తగా స్వాగతం పలుకుతూ ఓ ఆసక్తికర విషయన్ని నరేష్‌ వెల్లడించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో … కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభాలు… మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన రిలేషన్ గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు నరేష్‌, పవిత్ర. అనుమానాలు అవసరం లేదు, గ్యాప్‌కు తావు లేదు..మేము ఇద్దరం కాదు ఒక్కటే అని తేల్చిచెప్పారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో చివర్లో వారిద్దరూ ముద్దు పెట్టుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉండడం పట్ల నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version