Site icon Prime9

VJ Sunny : బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి గాయం.. ఇప్పుడు ఎలా ఉందంటే?

actor vj sunny got injured in movie shooting

actor vj sunny got injured in movie shooting

VJ Sunny : బిగ్ బాస్ విన్నర్ సన్నీ ప్రేక్షకులకు సుపరిచితుడే. అత్తకు ముందు బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన యాంకర్.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లల్లో నటిస్తున్న సన్నీ ఇటీవల ఆహా వేదికగా ఏటీఎం వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించాడు. ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా “అన్ స్టాపబుల్” మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పోసాని, 30 ఇయర్స్ పృథ్వి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి.. ఇలా టాలీవుడ్ కమెడియన్ గ్యాంగ్ మొత్తం నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రజిత్ రావ్ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర ప్రోమోను డైరెక్టర్ స్పెషల్ గా షూట్ చేస్తున్నారు. థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, వీజే సన్నీ ఈ ప్రోమో షూట్ లో పాల్గొన్నారు. పోలీస్ గెటప్ లో ఉన్న సప్తగిరి రివాల్వర్ చూపిస్తూ 30 ఇయర్స్ పృథ్విని ‘అన్ స్టాపబుల్’ మూవీ రిలీజ్ ఎప్పుడని అడిగాడు. థర్టీ ఇయర్స్ పృథ్వి నాకు తెలియదని సమాధానం చెప్పాడు. సీన్లోకి వచ్చిన వీజే సన్నీకి రివాల్వర్ ఎక్కుపెట్టి సప్తగిరి అతన్ని కూడా అదే ప్రశ్న అడిగారు. ఈ క్రమంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్ పొరపాటున పేలి ఆ బుల్లెట్ అతి దగ్గరగా సన్నీ భుజానికి తాకింది.

దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. వెంటనే యూనిట్ ఆయనని స్థానిక ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకపోతే అది డమ్మీ బుల్లెట్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ దగ్గరగా ఈ ఘటన జరగడంతో సన్నీ గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు ఇది ప్రమోషనల్ స్టంట్ అని అంతా భావిస్తున్నారు. సన్నీ నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ విడుదలకు ముందు ఏటీఎం ను దొంగిలించి పారిపోతున్నట్లు ఓ సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఇప్పుడు కూడా ఇలా కావాలనే హేశయి ఉంటారని అభిప్రాయ పడుతున్నారు.

Exit mobile version