Site icon Prime9

Actor Sushanth Anumolu : సుశాంత్ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన “భోళా శంకర్” టీమ్.. ఎప్పటి నుంచో వెయిటింగ్ అంటూ రిప్లయ్

actor sushanth anumolu poster released from bhola shankar movie

actor sushanth anumolu poster released from bhola shankar movie

Actor Sushanth Anumolu : అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు సుశాంత్. 2008 లో వచ్చిన కాళిదాసు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం ఎంట్రీ ఇచ్చాడు  “సుశాంత్ అనుమోలు’.  ఆ తర్వాత సుశాంత్ నటించిన కరెంట్ సినిమా మ్యూజిక్ చార్ట్ బాస్టర్ గా నిలిచింది. తర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా.. పలు సినిమాలు చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. కాగా అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం” సినిమాతో కొంచెం ట్రాక్ మార్చి ముఖ్య పాత్రలు కూడా చేస్తున్నాడు. ఆ సినిమాలో తనదైన నటనతో మెప్పించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం హీరో గానే కాకుండా.. ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు.

కాగా ప్రస్తుతం వరుస ఆఫర్లతో చెలరేగుతున్న సుశాంత్ తాజాగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్ గా వస్తుంది. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది.

నిజానికి.. ఈ భోళా శంకర్ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ.. షూటింగ్ జాప్యం అవ్వడంతో వాయిదా వేయక తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్‌ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. భోళా శంకర్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ట్విట్టర్ వేదికగా సుశాంత్ ఫోటోని షేర్ చేసి.. భోళా శంకర్ ఫ్యామిలీ లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. ఇందుకు సుశాంత్ బదులిస్తూ మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం చాలా హ్యాప్పీ గా ఉంది అని రిప్లయ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్ కి విషెస్ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.  రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబో లో తెరకెక్కుతున్న ఈ  యాక్షన్ థ్రిల్లర్ ని.. రవితేజ, అభిషేక్ నామాలు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

 

Exit mobile version