Site icon Prime9

Actor Nani : డిసెంబర్ లో వెంకీ మామతో పోటీకి నాని సై.. రెండు మూవీస్ లో కామన్ పాయింట్ అదే

actor nani 30 movie competeting venkatesh 75 for this year christmas

actor nani 30 movie competeting venkatesh 75 for this year christmas

Actor Nani : నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది . ఇటీవలే ఆయన నటించిన ‘దసరా’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.  డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేశాడు నాని. ఇక నానికి తోడు మహానటి ఫేమ్ కీర్తి సురేష్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా వారి పాత్రల్లో జీవించేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇటీవలే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. కలెక్షన్ల విషయంలో తగ్గేదెలే అంటూ దూసుకుపోతుంది.

అదే జోష్ లో తన నెక్స్ట్ మూవీని కూడా ప్రకటించిన నాని.. శరవేగంగా గోవాలో షూటింగ్ చేసుకుంటున్నారు. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రానుందని తెలుస్తుంది. ఈ సినిమాలో తండ్రికూతుళ్ల ఎమోషన్స్ హైలైట్ కానున్నాయని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే అర్దం అవుతుంది. ఈ సినిమాలో నాని సరసన “సీతారామం” బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా ఈ సినిమా నుండి తాజాగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21,  2023 న ఈ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే మరోవైపు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ “సైంధవ్”. ఇటీవలే హిట్ వంటి థ్రిల్లర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ నిన్న (ఏప్రిల్ 15) వైజాగ్ లో మొదలైంది.

ఈ ఏడాది క్రిస్మస్ కి నాని (Actor Nani) వర్సెస్ వెంకటేష్..

జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా డిసెంబర్ 22న సైంధవ్ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నాని సినిమా కూడా క్రిస్మస్ కి రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని భావిస్తున్నారు. కేవలం ఒక రోజు గ్యాప్ తోనే రెండు సినిమాలు వస్తుండడంతో ఈసారి క్రిస్మస్ టాలీవుడ్ లో మంచి హీట్ పెంచుతుందని భావిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో కూతురు సెంటిమెంట్ కామన్ అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

 

Exit mobile version