Site icon Prime9

Viral News: ఇదేం పాడుపని… ఛీఛీ.. కూరగాయలపై మూత్రం పోసి విక్రయిస్తున్న వ్యాపారి

utter Pradesh vegetables vendor urinates vegetables

utter Pradesh vegetables vendor urinates vegetables

Viral News: కొందరు వ్యాపారులు చేస్తున్న పనులు చూస్తుంటే పట్టలేనంత కోపం వస్తుంది. అలాంటి వారిని అస్సలు సహించకూదని వారికి తగినబుద్ధి చెప్పాలనిపిస్తుంది. అయితే పానీపూరీ విక్రయించే చిరు వ్యాపారులు కొందరు అందులో మురుగు నీరు కలపడం, హోటళ్లలోని ఆహారపదార్దాల తయారీలో ఉమ్మి, చెమట వేయడం, వంట చేసే దగ్గర శుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. కాగా ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ బరేలీ పరిధిలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కూరగాయలపై మూత్రం పోసి విక్రయించడం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్న షరీప్‌ఖాన్‌ గత 30ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఎప్పుడూ ఇతడిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయితే ప్రస్తుతం అతడిని చూస్తేనే అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలావుండగా షరీప్‌ఖాన్‌ శుక్రవారం ఉదయం వేళ కూరగాయలు విక్రయిస్తూ ఎవ్వరూ లేని ప్రదేశం చూసి వాటిపై ఉమ్మివేసి, మూత్రం పోసిన అనంతరం వాటిని అమ్మడం మొదలెట్టాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇందంతా గమనించి స్థానికులకు చెప్పాడు. కాగా అక్కడి స్థానికులు ఈ విషయంపై ప్రేమ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా.. చివరకు తప్పు ఒప్పుకున్నాడు. నన్ను క్షమించండి.. ఇక మీద ఇలాంటి తప్పు చేయను అంటూ వేడుకున్నాడు. దీనిపై స్థానికులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే నచ్చకే ఇలాంటి పని చేశాడని.. కొన్ని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: Viral News: కుక్కను కారుకు కట్టేసి ఊరంతా తిప్పిన వైద్యుడు… వీడియో వైరల్

Exit mobile version