CM KCR: వివరాల్లోకి వెళ్లితే. భూపాలపల్లి మండలం నందిగ్రామకు చెందిన సురేష్ సీఎం కేసిఆర్ అభిమాని. తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంత పాత్రను తెలియచేసారు. ఈ క్రమంలో 2013లో సురేశ్ భార్య పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎగిరి గంతేసిన సురేష్ తన చిన్నారికి కేసిఆర్ చేతులమీదుగా పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఇంకేముంది ఆనాటి నుండి నేటి వరకు 9ఏళ్ల పాటు ఎదురు చూడడం సురేష్ కుటుంబం వంతైంది. ఆ ఆడపిల్లకు పేరు పెట్టకుండా పెంచుకుంటూ వస్తున్న విషయాన్ని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచ్చారి తెలుసుకొన్నారు. విషయాన్ని సీఎంకు తెలిపి సురేశ్ కుటుంబసభ్యులను ప్రగతి భవన్ కు తోడ్కొని వెళ్లారు.
సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు మహతి అని కేసిఆర్ దంపతులు నామకరణం చేశారు. దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమివ్వడంతోపాటు చిన్నారి చదువుకు ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. తమ సుదీర్ఘమైన కల నెరవేరడంతో సురేష్, అనిత ఉబ్బితబ్బిబ్బయ్యారు. సతీసమేతంగా తమను కేసిఆర్ దంపతులు దీవించడంతో సంబ్రమాశ్చర్యాలకు లోనవడం సురేశ్ వంతైంది.