Site icon Prime9

Bihar: మా అమ్మ అన్నం పెట్టమంటే కొడుతుంది సార్.. పోలీసులకు 8 ఏళ్ల చిన్నారి ఫిర్యాదు

Bihar state police station

Bihar state police station

Bihar: తల్లీపిల్లల అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. కొడుకుకు ఆకలేస్తుందేమోనని ముందే కొసరి కొసరి తినిపిస్తుంటారు. కానీ ఓ అమ్మ అన్నం పెట్టలేదని 8 ఏళ్ల కుమారుడు పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మరి చూసేద్దామా.

అన్నం పెట్టమంటే అమ్మ కొడుతోంది సార్, టైంకి బువ్వ పెట్టడం లేదు. నాకేమో ఆకలేస్తుంది ఎవరిని అడగాలి నేను. ఒక్కోసారి నేను తింటుంటే కంచం లాక్కొని విసిరిపారేస్తుంది సార్‌ అంటూ తల్లి పై ఫిర్యాదు చేయడానికి ఓ 8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఈ ఉదంతం బిహార్ రాష్ట్రం సీతామఢీలో చోటుచేసుకుంది. స్టేషనుకు వచ్చిన ఆ చిన్నారిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

సీతామఢీలోని చంద్రిక మార్కెట్‌ వీధి సిటీ పోలీసుల ముందు నిలుచుని ఏడుస్తూ ఉన్న ఆ చిన్నారిని చూసి పోలీసులకు ఏమిచేయాలో అర్థంకాలేదు. ముందు అయితే ఆ బాలుడికి కడుపు నిండా అన్నం పెట్టారు. తరువాత ఏం జరిగింది బాబు అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరోచోట ఉంటాడని ఆ బాలుడు చెప్పాడు. చిన్నారి తెలిపిన చిరునామా ప్రకారం పోలీసులు ఆ బాలుడిని తీసుకుని వారి ఇంటికి వెళ్లారు. ఆ చిన్నారి తల్లిని విచారించారు. అలాంటిదేం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పారు. ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తాము అక్కడి నుంచి వెళ్లిపోయామని పోలీసు అధికారి రాకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే ఈ సంఘటన సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: ర్యాంటాక్‌, జింటాక్‌ టాబ్లెట్లను నిషేధించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Exit mobile version
Skip to toolbar