Site icon Prime9

Gas Leakage: అనకాపల్లి జిల్లాలో విషవాయువు కలకలం 469 మంది కార్మికులకు అస్వస్దత

Gas Leakage in Achutapuram: ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సీడ్స్‌ దుస్తుల కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. ఈ ఏడాది జూన్‌ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా అదే కంపెనీలోని బి.షిఫ్టులో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. మరో మూడు గంటల్లో విధులు ముగుస్తాయనగా, గాఢమైన విషవాయువు విడుదలై మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకేసారి పదుల సంఖ్యలో మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో కంపెనీలో ప్రాథమిక చికిత్స అందించారు.

బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో అచ్యుతాపురం పీహెచ్‌సీకి తరలించారు. స్థానికంగా ఉన్న రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక మహిళా కార్మికులు నరకం అనుభవించారు. గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయం లేకపోవడంతో ఊపిరందక మహిళా కార్మికులు ప్రాణభయంతో కేకలు వేశారు. వీరిలో ఊపిరి అందనివారిని అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి, వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

అచ్యుతాపురంలో 40 మంది కార్మికులకు చికిత్స అందిస్తున్నారు. సీడ్స్‌ కంపెనీలో మరోసారి గ్యాస్‌ లీకైందని బ్రాండిక్స్‌ అపెరల్‌సిటీ పరిధిలో పనిచేసే ఇతర కార్మికులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదంపై అనకాపల్లి జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన నిపుణుల కమిటీ విచారించినా, ఇంతవరకూ ప్రమాదానికి కారణాలు, విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో ఇంకా చెప్పలేదు

Exit mobile version