Site icon Prime9

Ukraine: ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికుల అత్యాచారాలు.. జెలెన్‌ స్కీ భార్య ఒలెనా జెలెన్‌ స్కీ ఆరోపణ

Ukrain

Ukrain

Ukraine: ఉక్రెయిన్‌ ఫస్ట్‌ లేడి.. అంటే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భార్య ఒలెనా జెలెన్‌ స్కీ రష్యా సైనికులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ మహిళలను దారుణంగా అత్యాచారాలు చేయాలని సైనికుల భార్యలే తమ భర్తలను ప్రోత్సహిస్తున్నారు. అత్యాచారాన్ని ఒక ఆయుధంగా మలచుకోవాలని వారు తమ భర్తలను కోరుతున్నారని ఆమె లండన్‌లోని ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో లైంగిక దాడులను ఎలా అధిగమించాలనే సదస్సులో ఆమె మాట్లాడారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా తమ దేశంపై ఆక్రమణకు పాల్పడిందని.. ఒక పద్దతి ప్రకారం రష్యా సైనికులు ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. లైంగిక దాడి అనేది అత్యంత క్రూరమైనదని ఆమె అభివర్ణించారు. రష్యా సైనికులు తమ పశువాంచ తీసుకోవడానికి ఉక్రెయిన్‌ మహిళలపై దారుణంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. యుద్ధం సమయంలో ఏ మహిళకు భద్రత లేకుండా పోయిందని ఆమె వాపోయారు. రష్యా సైనికులు అత్యాచారాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారని ఆమె అన్నారు. అందుకే వారు ఒక పద్దతి ప్రకారం బహిరంగంగానే ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాలు చేస్తూ పోతున్నారు. ఇప్పటికి చాలా మంది రష్యన్‌ సైనికులు తమ బంధువులతో బహిరంగంగానే ఫోన్‌లలో తాము చేసిన ఘనకార్యాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆమె తెలిపారు. వారు మాట్లాడిన సంభాషణలు తమ వద్ద ఉన్నాయని ఒలెనా జెలెన్‌ స్కీ పేర్కొన్నారు.

వెళ్లండి.. ఉక్రెయిన్‌ మహిళలను రేప్‌ చేయండని తమ భర్తలను ఉసిగోల్పుతున్నారని ఒలెనా అన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిని శిక్షించాలని ఆమె కోరారు.

Exit mobile version