Site icon Prime9

Sejong University: ఇక పై అంతా వైర్ లెస్.. తీగలు లేని కరెంట్..!

International News prime9 news

International News prime9 news

South Korea: కరెంటును తీగలు లేకుండా ఊహించుకోండి అంటే వైర్ లెస్ కరెంటు అన్నమాట ఎంత బాగుంటుందో కదా. అప్పుడు కరెంటు తీగలు తగిలి మృతి, తెగి పడిన కరెంటు తీగలు అనే మాటలు మనం వినే పని ఉండదు కదూ. సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేసిన కొందరు వ్యక్తులు వైర్లెస్ కరెంటును ఉత్పత్తి చేశారు. మరి ఆ వైర్లెస్ కరెంటు విశేషాలేంటి దానిని ఎక్కడ ఎవరు ఉత్పత్తి చేశారో చూసేద్దామా.

వైర్లెస్ ఇంటర్నెట్ గురించి విన్నాం చూస్తున్నాం. కానీ వైర్లెస్ కరెంట్ ను ఎక్కడైనా చూసామా, అసలు వైర్లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏం ఉంటుంది చెప్పండి. ఏమో త్వరలోనే వైర్‌లెస్‌ కరెంటు కూడా మన ఇంట్లోకి రావొచ్చేమో కదా. ఇటీవల దక్షిణ కొరియా లోని సెజాంగ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ఇలాంటి వైర్లెస్ కరెంటు పై ఓ పరిశోధనను విజయవంతంగా నిర్వహించింది.

30 మీటర్ల దూరం దాకా ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఉపయోగించి తీగల సహాయం లేకుండా విద్యుత్తును ప్రసరింపజేసింది. 400 మిల్లీ వాట్ల విద్యుత్తును సురక్షితంగా ప్రసరింపజేసి ఎల్‌ఈడీ లైటును వెలిగించారు. ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌ ద్వారా ఈ విద్యుత్తు సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్‌ సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుందని ఆ బృందం తెలిపింది. దీని వల్ల ఎలాంటి అపాయాలు ఉండవని వారు పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్‌ హోమ్స్‌ లేదా షాపింగ్‌ మాల్స్‌లో ఇంటర్నెట్‌ ద్వారా పనిచేసే పరికరాలకు విద్యుత్ అందించవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చదవండి: శరీరం మొత్తాన్ని పునరుత్పత్తి చెయ్యగల అరుదైన జీవి

Exit mobile version