China employees retirement: ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలకు వీరిని కూర్చోబెట్టి పెన్షన్‌లు ఇవ్వడం తలకు మించిన భారంగా భావిస్తోంది. ఫ్రాన్స్‌లో మెక్రాన్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 నుంచి 64కు పెంచింది. తాజాగా చైనా కూడా రిటైర్మెంట్ వయసును పెంచే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.
తాజాగా ఫ్రాన్స్‌లోని మక్రాన్ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన చేసింది. ఫ్రెంచి పౌరులు తమకు పెన్షన్ రావాలంటే మరో రెండు సంవత్సరాల పాటు పనిచేస్తేనే కానీ పెన్షన్ దక్కదు. దేశంలోని పౌరులు ఇప్పటికి పలుమార్లు సమ్మెకు దిగారు. రిటైర్మెంట్ వయసు పెంచవద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా మక్రాన్ ప్రభుత్వం మాత్రం బిల్లును పార్లమెంటులోప్రవేశపెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే రిటైర్మెంట్ తర్వాత తమ పౌరులకు పెన్షన్ ఇవ్వాలనుకుంటే చేతిలో డబ్బు లేదు. అందుకే ఫ్రాన్స్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచేసింది.
చైనా విషయానికి వస్తే చైనాలో కూడా వయసు మీద పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో షి జిన్‌పింగ్ సర్కార్ రిటైర్మెంట్ వయసు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ తాజాగా ఓ వార్త ప్రచురించింది. చైనాకు చెందిన సీనియర్ మానవవనరుల మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొంది. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్నన వారిని మరి కొన్ని నెలల పాటు కొనసాగించేలా నిబంధనలు మార్చుతున్నట్లు తెలిపింది. అలాగే యువత విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల పాటు ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.అయితే రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్న ఉద్యోగుల విషయానికి వస్తే వారిని ఎన్ని సంవత్సరాల కొనసాగాలో నిర్ణయించుకునే వెసలు బాటును ప్రభుత్వం ఉద్యోగికే కల్పిస్తోంది. ఎందుకంటే వారి ఆరోగ్య సమస్యలతో పాటు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం మాత్రం ఉద్యోగికే వదిలిపెట్టారు. ఇక రిటైర్మెంట్ విషయానికి వస్తే ప్రపంచదేశాలతో పోల్చుకుంటే చైనాలో అతి తక్కువగా ఉంది. పురుషులకు 60 ఏళ్లు కాగా.. వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే మహిళలకు 55 ఏళ్లు మాత్రమే. అలాగే ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల విషయానికి వస్తే వారి రిటైర్మెంట్ వయసు 50గా నిర్ణయించారు.
చైనా జనాభా 140 కోట్లు. పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా ప్రభుత్వం 1980 నుంచి 2015 వరకు కఠినమైన జనాభా నియంత్రణ పాటించింది. వన్ చైల్డ్ పాలసీ అమల్లోకి తెచ్చింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అంచనా ప్రకారం 60 ఏళ్లు వయసు దాటిన వారి సంఖ్య ప్రస్తుతం 280 మిలియన్‌ల నుంచి 2035 నాటికి వారి సంఖ్య 400 మిలియన్‌లకు చేరుతుంది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచాలనే ఆలోచోనలో ఉందని తెలిపింది.చైనా ఒకప్పుడు కఠినమైన జనాభా నియంత్రణను పాటించింది. ప్రస్తుతం వయసు పై బడుతున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రభుత్వమే వన్ చైల్డ్ పాలసీని తీసేసింది. పిల్లల్ని కనండంటూ ప్రోత్సాహాకాలు అందిస్తోంది. దీంతో తిరిగి జనాభాను పెంచుకొనే ఆలోచనలో ఉంది.