Site icon Prime9

Kiev: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకస్మిక పర్యటన

Kiev

Kiev

Kiev: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ సైతం చేశారు. ఈ నెల 24తో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలై ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలో ముందుగానే ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది.

ఏడాది క్రితం పుతిన్‌ ఉక్రెయిన్‌పై దురాక్రమణను ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్‌ బలహీనమైందని, పాశ్చాత్య దేశాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయని భావించారు. పుతిన్‌ అందరిని అధిగమించిపోగలనన్న ఆత్మవిశ్వాసమే అతను చేసిన అతి పెద్ద తప్పిదమన్నారు అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌. ఈ ఏడాది కాలంలో అట్లాంటిక్‌, ఫసిపిక్‌ పరిధిలో ఉన్న అన్ని దేశాలు ఉక్రెయిన్‌ పోరాటానికి కావాల్సిన అన్నిరకాల సాయాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకు అమెరికా ఒక సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసిందని బైడెన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

యుద్దం తరువాత మొదటిసారి ఉక్రెయిన్ లో పర్యటన..(Kiev)

అలాగే.. యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న తరుణంలో కీవ్‌లో పర్యటిస్తున్నట్లు.. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల అమెరికా తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు బైడెన్‌ ట్వీట్లు చేశారు. ఇక యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడుఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. యూఎస్‌ చట్టసభలో ప్రసగించి.. యుద్ధంలో మద్దతు కోరారు. అత్యాధునిక ఆయుధాలు వీలైనంత త్వరగా అందివ్వాలని కోరారు. తనను ఉక్రెయిన్ మారణాయుధాల సరఫరాను కోరిన రోజును గుర్తు చేసుకున్నారు. పుతిన్ తన దేశంపై యుద్ధాన్ని ప్రారంభించిన కొద్ది నిమిషాల తర్వాత అధ్యక్షుడు జెలెన్స్కీ నన్ను పిలిచారు. తన దేశాన్ని రక్షించుకోవడానికి అత్యంత అధునాతన ఆయుధాలను సరఫరా చేయాలని అతను నన్ను కోరారు” అని బిడెన్ చెప్పారు. “ఉక్రెయిన్‌కు నా మద్దతును అందిస్తానని నేను అతనికి హామీ ఇచ్చాను. అంతేకాకుండా, పరీక్ష సమయంలో మా ఇతర యూరోపియన్ మిత్రదేశాలు జెలెన్స్కీకి సహాయం చేస్తాయని కూడా నేను అతనికి హామీ ఇచ్చానుని అన్నారు.

ఉక్రెయిన్ కు 500 మిలియన్ డాలర్ల సహాయం..

రష్యా దాడి చేసిన సమయంలో ఉక్రెయిన్ బలహీనంగా ఉందని బైడెన్ అన్నారు.అయినప్పటికీ, జెలెన్స్కీ తన దేశాన్ని చాలా బలంగా మార్చారని పేర్కొన్నారు. వందలాది బహుళజాతి కంపెనీలు దేశం విడిచిపెట్టడం లేదా ఆంక్షలు విధించడం వల్ల రష్యా ఇప్పుడు అపూర్వమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బిడెన్ అన్నారు.పుతిన్ యొక్క యుద్ధ విజయం విఫలమవుతోంది. రష్యా సైన్యం ఒకసారి ఆక్రమించిన దానిలో సగం భూభాగాన్ని కోల్పోయింది. యువకులు, ప్రతిభావంతులైన రష్యన్లు రష్యా నుండి పారిపోతున్నారు, ఎందుకంటే వారు దేశంలో భవిష్యత్తును చూడలేరు. రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఒంటరిగా ఉంది మరియు పోరాడుతోంది” అని బిడెన్ అన్నారు.మేము ఉక్రెయిన్‌కు 500 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటిస్తాము. ఇందులో జావెలిన్‌లు, హోవిట్జర్‌లు మరియు ఫిరంగి మందుగుండు సామగ్రి ఉంటాయి. తరువాత, రష్యాకు మద్దతుగా ప్రయత్నిస్తున్న కంపెనీలపై అదనపు ఆంక్షలు ప్రకటిస్తాము,” అన్నారాయన.

ఇదిలా ఉండగా గత నెల జనవరిలో యూఎస్‌ సెనేటర్ల బృందం ఒకటి కీవ్‌లో పర్యటించింది. వాస్తవానికి బైడెన్‌ పోలాండ్‌లో పర్యటిస్తారని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ల్యాండ్‌ అయ్యి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. కాగా కీవ్‌లో బైడెన్‌ దిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేయగా.. దీనిపై పుతిన్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Exit mobile version