Site icon Prime9

Twitter Bird: తిరిగొచ్చిన లిటిల్ బర్డ్’.. మరోసారి మారిన ట్విటర్ లోగో

Twitter Bird

Twitter Bird

Twitter Bird: మరోసారి ట్విటర్ లోగోను మారింది. మూడు రోజుల క్రితం బ్లూ బర్డ్ ను తీసేసి .. ఆ ప్లేసులో క్రిప్టో కరెన్సీ డీజీకాయిన్ సంబంధించిన మీమ్ ‘డోజీ డాగ్’ను లోగో గా పెట్టి షాక్ ఇచ్చారు సీఈఏ ఎలాన్ మస్క్. అయితే, ఇపుడు మరోసారి దాని స్థానంలో పాత బ్లూ బర్డ్ ను తీసుకువచ్చారు. దీంతో మూడు రోజుల తర్వాత పిట్ట సొంతగూటికి చేరినట్టైంది.

నెటిజన్ల విమర్శలు(Twitter Bird)

కాగా, ట్విటర్ లోగో మార్చి డిజీ డాగ్ ను పెట్టడంపై మస్క్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని.. అందువల్లే డోజీ మీమ్ ను ట్విటర్ లోగో గా పెట్టినట్టు నెటిజన్లు విమర్శించారు. కానీ, విమర్శలపై స్పందించిన ఎలాన్… ఓ నెటిజన్ కు ఇచ్చిన మాట ప్రకారం లోగో మార్పు జరిగిందని వివరణ ఇచ్చారు. దీంతో మూడు తర్వాత మళ్లీ పాత పిట్టను తీసుకొచ్చారు.

గత ఏడాది డోజీ కాయిన్ ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా 258 బిలియన్ల డాలర్ల భారీ పరిహారం కోరుతూ కోర్టులో పిల్ దాఖలు చేశారు. డోజీ కాయిన్ ధరను కృత్తిమంగా పెంచి, ఆ తర్వాత పతనానికి కారణమవుతున్నారని ఇన్వెస్టర్లు ఆరోపించారు.

 

కుక్క లోగో తో షాక్ ఇచ్చి..

మూడు రోజుల క్రితం ట్విటర్ లోగో లోనే ఛేంజెస్ చేశాడు. ట్విటర్ అనగానే గుర్తుకు వచ్చేది బ్లూ బర్డ్ లోగో. కానీ ఆ లోగోని తీసేసి దాని ప్లేసులో కుక్క లోగోను పెట్టాడు ఎలాన్ మస్క్. అయితే ఈ మార్పు డెస్క్ టాప్ యూజర్స్ కు మాత్రమే కనిపించింది. మొబైల్ యాప్ లో మాత్రం బ్లూ బర్డ్ లోగో ఉంది. కాగా, ట్విటర్ లోగో మార్పును ఎలాన్ మాస్క్ కూడా కన్ఫార్మ్ చేశాడు. ఇకపై ట్విటర్ లోగో గా డోజీ మీమ్ ఉండనుందని ట్వీట్ చేశాడు. ఇక బ్లూబర్డ్ ఓల్డ్ వెర్షన్ అని తెలియజేస్తూ కొత్త లోగో ఉన్న మీమ్ ను ట్వీట్ కు జత చేశాడు. ఈ సందర్బంగా 2022, మార్చి 26 నాటి పాత చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నాడు. అందులో ఓ యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను డాగ్ గా మార్చాలని అడిగాడు. దానికి మస్క్ అప్పట్లో సానుకూలంగా రియాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో అప్పుడు చెప్పినట్టు ట్విటర్ లోగోను మార్చినట్టు చెప్పాడు. అయితే ఈ లోగో శాశ్వతంగా ఉండనుందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

 

Exit mobile version