Prime9

Ttrump Halts Students Visa interviews: ట్రంప్ మరో ఝలక్.. విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్

Donald Trump Halts Students Visa interviews: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల విసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయించారు. ఈ మేరకు వివిధ దేశాల్లోని యూఎస్ ఎంబసీలకు ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దౌత్య విభాగాలు కొత్తగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను నిర్వహించవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్ని దేశాల యూఎస్ ఎంబసీలను ఆదేశించారు. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పారు. కాగా ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు. అయితే అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

 

అయితే కొంత కాలంగా విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ విద్యార్థులకు వీసాలకు కఠిన నిబంధలను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. విద్యార్థి వీసా కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్ మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలానికి సంబంధించిన వివరాలనూ యూఎస్ ఇమిగ్రేషన్ నిపుణులు పరిశీలించనున్నారు.

 

Exit mobile version
Skip to toolbar