Brazil: కుండపోత వర్షాల కారణంగా రియో డి జెనీరోలో 11 మంది మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది.తుఫాను ప్రభావంతో రియోలోని ఉత్తర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, విద్యుదాఘాతాలతో ప్రజలుమరణించారు. పెద్ద సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అవెనిడా డి బ్రెసిల్‌లోని కొన్ని ప్రాంతాలలో కార్లు నీటిలో తేలాయి.
24 గంటల్లో నెలరోజుల వర్షం..( Brazil)
మేయర్ ఎడ్వర్డో పేస్ ప్రస్తుత పరిస్థితిని అత్యవసర పరిస్థితి గా పేర్కొన్నారు. ప్రజలు తమ భద్రత కోసం ఇంట్లోనే ఉండాలని, రెస్క్యూ మరియు రికవరీ ప్రయత్నాలకు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరారు.ట్రాక్‌లపై నీరు చేరడంతో అనేక మెట్రో స్టేషన్లు మూసివేయబడ్డాయి.నగరంలోని కొన్ని ప్రాంతాల్లోకేవలం 24 గంటల్లో ఒక నెల రోజుల వర్షం పడిందని సమాచారం. అత్యంత ప్రభావితమైన పరిసరాల్లో ఒకటైన అకారీలో, రొనాల్డో గజోల్లా ఆసుపత్రిలోని బేస్‌మెంట్ కార్యాలయాలను నీరు ముంచెత్తగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.రియో డి జనీరో రాష్ట్రంలోని చుట్టుపక్కల ఎనిమిది పట్టణాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించే జాతీయ ఏజెన్సీ తెలిపింది.