Site icon Prime9

Toronto Airport: 20 మిలియన్‌ డాలర్ల బంగారం కంటైనర్ ఎత్తుకెళ్లిన దుండగులు

Toronto Airport

Toronto Airport

Toronto Airport: కెనడా లోని టొరొంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీ చోరీ జరిగింది. కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కార్గో కంటైనర్‌ను దుండగులు ఎత్తుకుపోయారు. ఏప్రిల్‌ 17న జరిగిన ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

కంటైనర్ మాయంపై దర్యాప్తు(Toronto Airport)

టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ విమానం నుంచి దాదాపు 5 నుంచి 6 చదరపు అడుగులున్న ఓ కంటైనర్‌ను కిందకు దించారు. ఆ కంటైనర్ లో సుమారు 20 మిలియన్‌ కెనడియన్ డాలర్ల(15 మిలియన్ల అమెరికన్ డాలర్లు) విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండా.. అదృశ్యం అయింది. ఈ చోరీ వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. అయితే ఈ కంటైనర్‌ ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు రవాణా చేశారో వంటి వివరాలేవీ వెల్లడించలేదు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా ఇప్పటి వరకు కనీసం అనుమానితులను కూడా పోలీసులు కనిపెట్టలేదు. కంటైనర్ మాయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు.

 

ఇది తొలిసారి కాదు(Toronto Airport)

కాగా, కెనడా ఎయిర్ పోర్టులో భారీ చోరీ జరగడం ఇది మొదటిసారి కాదు. టొరంటో ఎయిర్ పోర్టులో 1952 లో 2.15 లక్షల డాలర్ల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించుకు పోయారు. దాని విలువు ప్రస్తుతం 23 లక్షల డాలర్లకు పైగా ఉంటుంది. అయితే ఈ కేసును ఇప్పటికీ పోలీసులు కనిపెట్టలేక పోయారు. అదే విధంగా అట్టావా ఎయిర్ పోర్టులో సేఫ్ గా ఉంచిన బంగారాన్ని ఓ గార్డు తుపాకీతో బెదిరించి దొంగలించాడు. దాని విలువ కూడా 4.6 మిలియన్ డాలర్లకు సమానమని అక్కడి వార్తా కథనాలు వెల్లడించాయి.

 

 

Exit mobile version