Israeli Airstrike: గాజాపై వైమానిక దాడిలో టాప్ హమాస్ కమాండర్ ఇబ్రహీం బియారీ హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్) బుధవారం ప్రకటించింది.ఐడిఎఫ్ ఫైటర్ జెట్లు హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీని హతమార్చాయి అక్టోబర్ 7న జరిగిన హంతక ఉగ్రవాద డికి కారణమైన నాయకులలో బియారీ ఒకరు అని ఐడిఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పేర్కొంది.
ఎవరీ బియారీ ?( Israeli Airstrike)
వైమానిక దాడిలో బియారీతో పాటు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు, ఇది ప్రాంతంలో హమాస్ కమాండ్ మరియు నియంత్రణను దెబ్బతీసింది. ఈదాడి తర్వాత భూగర్భ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూడా కుప్పకూలాయి.బియారీ హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్. అక్టోబర్ 7న 1,400 మందికి పైగా మరణించిన విధ్వంసక దాడిని నిర్వహించడానికి హమాస్ సమూహం యొక్క ‘నుఖ్బా’ (ఎలైట్) దళాలను ఇజ్రాయెల్‌కు పంపడానికి బియారీ బాధ్యత వహించాడు.2004 అష్డోద్ పోర్ట్ ఉగ్రదాడిలో 13 మంది ఇజ్రాయెల్‌లు మరణించిన సమయంలో ఉగ్రవాదులను పంపించడంలో బియారీ కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ వైపు రాకెట్ దాడులకు దర్శకత్వం వహించాడు. గాజాలోని ఐడిఎఫ్ దళాలపై దాడికి బాధ్యత వహించాడని మిలటరీ తెలిపింది.అతని ఆధ్వర్యంలో సెంట్రల్ జబాలియా బెటాలియన్ ఈ ప్రాంతంలోని అనేక భవనాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇటువంటి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి.
ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో కనీసం 50 మంది మరణించారని గాజా హమాస్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.ఉత్తర గాజాలో హమాస్ తీవ్రవాదులతో పోరాడుతున్న మరో తొమ్మిది మంది సైనికులు మరణించినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. అంతకుముందు, ఉత్తర గాజాలో జరిగిన పోరాటంలో ఇద్దరు సైనికులు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది.