Site icon Prime9

King Charles III: కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. హాజరుకానున్న భారతీయులు వీరే

king charles 111

king charles 111

King Charles III: బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ వేడుకకు భారతీయులు కూడా హాజరవుతున్నారు.
ఈ వైభవ వేడుకకు ఎవరెవరు హాజరవుతున్నారో ఓ సారి చూద్దాం..

భారతీయులు వీరే.. (King Charles III)

బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ వేడుకకు భారతీయులు కూడా హాజరవుతున్నారు.
ఈ వైభవ వేడుకకు ఎవరెవరు హాజరవుతున్నారో ఓ సారి చూద్దాం.

కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో భారతీయులు కూడా చోటు సంపాదించారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా.. రాజకుటుంబ సంప్రదాయాలతో ఈ పట్టాభిషేకం జరగనుంది. వెస్ట్ మినిస్టర్ అబేలో ఏళ్ల చరిత్ర కలిగిన కళాఖండాల ఆకృతులతో ఈ వేడుక జరగనుంది.

ఉప రాష్ట్రపతి: భారత ప్రభుత్వం తరఫున ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ హాజరవుతున్నారు. నేడు జరిగే ఈ వేడుకకు.. ఒక రోజు ముందుగానే లండన్ చేరుకున్నారు. లండన్ లో దిగగానే ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.

యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి : యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య, ప్రథమ మహిళ అక్షతా మూర్తి రాజకుటుంబ పట్టాభిషేకం వేడుకలకు హాజరవుతారు.

సోనమ్ కపూర్ : కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేడుకల్లో కామన్వెల్త్ గాయక బృందం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ బృందానికి స్వాగతం పలుకుతూ సోనమ్ కపూర్ మాట్లాడనున్నారు. అతి స్వల్ప సమయమే అయినా సోనమ్ కపూర్ ఈ వేడకల్లో మెరిసిపోనున్నారు.

ముంబై డబ్బావాలాలు: ముంబయి నుంచి పేరుగాంచిన డబ్బావాలాల తరఫున వారి ప్రతినిధి హాజరు కానున్నారు.

ఈ మేరకు రాజుకు వర్కారీ కమ్యూనిటీ తయారు చేసిన పునేరీ పగిడిని కానుకగా ఇవ్వనున్నారు.

వీరితో పాటు.. సౌరభ్ పడ్కే గుల్ఫ్ షా, జై పటేల్ వంటి వారు పాల్గొననున్నారు. మంజు మల్హి సైతం ఈ వేడుకకు హాజరుకానున్నారు.

బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 ఈరోజు పట్టాభిషక కార్యక్రమానికి 203 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.

వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 12 వేల మంది పోలీసులు,10 వేల మంది సైనికులను మోహరించారు.

 

Exit mobile version