Venice canal: ఇటలీ నీటి నగరం వెనిస్‌లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇక్కడ ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే వెనిస్ నగరం గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారిపోయింది. కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
నీటివిశ్లేషణలో ఏం తేలిందంటే..( Venice canal)
వెనెటో రీజియన్ గవర్నర్ లూకా జైయా, రీజనల్ ఏజెన్సీ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వెనెటో (ARPAV) నీటిలో ఉన్న ఆకుపచ్చ పదార్థాన్ని పరీక్షించి దానిని ఫ్లోరో సిన్‌గా గుర్తించిందని తెలిపారు.నిన్న ఉదయం వెనిస్ నీటిలో కనిపించిన ఫ్లోరోసెంట్ గ్రీన్ ప్యాచ్ నుండి కాలుష్యం ప్రమాదం లేదు.ARPAV సాంకేతిక నిపుణులు తెల్లవారుజామున రంగుల నీటిని తీసుకుని విశ్లేషణలను చేపట్టారు. ఆకుపచ్చ ద్రవం నీటి తనిఖీలు లేదా గుహలో ఉపయోగించే ఒక కలరింగ్ ఆర్గానిక్ సమ్మేళనం వలె కనిపిస్తుందని గవర్నర్ ట్వీట్ చేసారు. స్కై న్యూస్ ప్రకారం, ఫ్లోరోసిన్ ఒక విషరహిత రసాయనం. ఇది లీక్‌లను గుర్తించడంలో సహాయపడటానికి నీటి అడుగున నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించబడుతుంది. కంటి చుక్కల రూపంలో, గాయాలను గుర్తంచడానికి ఈ రసాయనాన్ని వైద్యంలో కూడా ఉపయోగిస్తారు
ఇదిలా ఉండగా వెనిస్ గ్రాండ్ కెనాల్‌లో ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్ నికోలస్ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్ కెనాల్‌లో ఫ్లూరెసెయిన్ అనే డైని కలిపారు. ఆ సమయంలో వెనిస్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ జరగాల్సి ఉండగా పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయన ఈ పనిచేశారన్న వార్తలు వచ్చాయి.