Site icon Prime9

Jerusalem: ప్రార్ధన మందిరాలపై కొనసాగుతున్న ఉగ్రదాడి.. 8 మంది మృతి

jerusalem

jerusalem

Jerusalem: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రార్థన స్థలాలు.. మందిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. జెరూసలేంలోని  ప్రార్థనా మందిరంలో
శుక్రవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఇందులో కనీసం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ ఉగ్రవాది.. తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు.

ఈ దాడి ఘటనపై.. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని.. పోలీసులు మట్టుబెట్టారు.

ఈ ఘటన జెనిన్ శరణార్థి శిబిరంలో జరిగిన ఘర్షణల తర్వాత చోటు చేసుకుంది.

ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో ఒక మహిళతో పాటు.. పది మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దళాలచే చంపబడ్డారు.

వెస్ట్ బ్యాంక్ నగరంలో ఇజ్రాయెల్ దళాలచే చంపబడిన పాలస్తీనియన్ల సంఖ్య ఈ సంవత్సరం 30కి చేరుకుంది.

గాజాన్ ఉగ్రవాదుల  నుంచి రాకెట్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులను ప్రారంభించింది.

సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంలో రాకెట్లను తయారు చేసే భూగర్భ సదుపాయమైన బాటమ్ ఆఫ్ ఫారమ్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

ఇజ్రాయెల్ ప్రధాని సంతాపం

ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఉగ్రదాడులను సహించేంది లేదన్నారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన తెలిపారు. నిందితుడు పాలస్తీనకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు.

పాలస్తీనా సంబరాలు

ఈ దాడిని పాలస్తీనా  ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు.

Avinash Reddy Reached CBI office:హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar