Site icon Prime9

Taiwan: పర్యాటకులకు $82 మిలియన్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్న తైవాన్

Taiwan

Taiwan

Taiwan: తైవాన్ ఈ ఏడాది 500,000 మంది పర్యాటకులకు నగదు లేదా తగ్గింపు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. కరోనా అనంతరం పర్యాటక పరిశ్రమను అభివృద్ది చేయడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తైవాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

పర్యాటకం ద్వారా ఆదాయం పెంచడానికి చర్యలు..(Taiwan)

అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కటి 165 డాలర్ల విలువైన ప్రోత్సాహకాలు గురువారం ప్రకటించబడ్డాయి. పెర్క్‌ల మొత్తం విలువ బిలియన్ 82.4 మిలియన్ డాలర్లుగా వుంటుంది.రవాణా మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ త్వరలోమ ప్రోత్సాహకాల పంపిణీకి తగిన ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.డబ్బును ఎలక్ట్రానిక్‌గా లేదా వసతి, రవాణా లేదా ఇతర కొనుగోళ్లకు తగ్గింపుగా అందజేయవచ్చని అధికారులు తెలిపారు.అంతర్జాతీయ పర్యాటకులు తైవాన్‌కు రావడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలని మరియు విస్తరించాలని మేము ఆశిస్తున్నాము” అని రవాణా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ లిన్ ఫు-షాన్ అన్నారు. కరోనా ప్రభావంతో ఎగుమతులు తగ్గడంతో పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని తైవాన్ భావిస్తోంది.

పర్యాటకంపై కరోనా ఎఫెక్ట్ ..

మహమ్మారికి ముందు, తైవాన్ టూరిజం బ్యూరో ప్రకారం, తైవాన్ స్థూల జాతీయోత్పత్తిలో పర్యాటకం 4% వాటాను కలిగి ఉంది.తైవాన్ తన సరిహద్దులను మూసివేసి ఉంచడం,నిర్బంధ నియమాలను అమలు చేయడంతో సందర్శనలు దాదాపు నిలిచిపోయాయి. 2019లో తైవాన్‌కు వెళ్లే వ్యక్తిగత పర్యాటకులను చైనా నిషేధించింది. గత నెలలో చైనీస్ టూర్ గ్రూపుల కోసం అనుమతించబడిన 20 గమ్యస్థానాల జాబితా నుండి దానిని వదిలిపెట్టింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పర్యాటకంపై ప్రభావం చూపాయి. దీనితో సందర్శకులను స్వాగతించడానికి తైవాన్ కొన్ని చర్యలు తీసుకుంది.

ఆరు మిలియన్ల పర్యాటకులను రప్పించాలని లక్ష్యం..

ఈ నెలలో హాంకాంగ్ మరియు మకావు నుండి వ్యక్తిగత ప్రయాణికులకు దాని సరిహద్దులను తిరిగి తెరవాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆరు మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం కోరుకుంటోందని రవాణా మంత్రి వాంగ్ క్వా-త్సాయ్ ముందుగా చెప్పారు.గత అక్టోబర్‌లో తిరిగి తెరిచిన తర్వాత, 2022లో తైవాన్ దాదాపు 900,000 మంది పర్యాటకులను ఆకర్షించిందని తైవాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Exit mobile version