Site icon Prime9

Gotabaya Rajapaksa: శ్రీలంకకు తిరిగి వచ్చిన గొటబాయ రాజపక్స

Gotabaya-Rajapaksa

Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యారనే ఆరోపణలతో ప్రజల ఆగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం సొంత గడ్డ పై కాలు మోపారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయకు బంగళా, 24 గంటలపాటు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు రక్షణ వర్గాల సమాచారం. అధికారం నుంచి గొటబాయ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ జులైలో అధ్యక్ష భవనం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలు ముట్టడించిన సంగతి తెలిసిందే.

తర్వాత ఆయన ప్రాణభయంతో విదేశాలకు పారిపోయారు. ముందుగా తన భార్య, సిబ్బందితో బాడీగార్డులతో కలిసి మాల్దీవులకు పరారయ్యారు. అటునుంచి సింగపూర్‌, చివరిగా థాయ్‌లాండ్‌కు చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వం 90 రోజులు ఉండేందుకు మాత్రమే అనుమతిచ్చింది. థాయిలాండ్‌లో అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించింది. హోటల్‌ గది విడిచి బయటకు రావద్దని కోరింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలిని సలహా ఇచ్చింది.

దీనితో ప్రవాసంలో కూడా స్వేచ్చలేకపోవడంతో స్వదేశానికి రావాలని రాజపక్స నిర్ణయించుకున్నారు. శుక్రవారం థాయ్‌లాండ్‌ నుంచి సింగపూర్‌, అక్కడి నుంచి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో స్వదేశానికి గొటబాయ చేరుకున్నారు.

Exit mobile version
Skip to toolbar