South Korea:దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ సందర్బంగా 15 మంది తప్పిపోయినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
సియోల్‌కు దక్షిణంగా ఉన్న హ్వాసోంగ్ నగరంలోని కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ కార్మికులు కర్మాగారం నుండి ఎనిమిది అదనపు మృతదేహాలను వెలికితీశారు.స్థానిక అగ్నిమాపక అధికారి కిమ్ జిన్-యంగ్ తప్పిపోయిన వారిలో ఎక్కువ మంది చైనీయులతో సహా విదేశీ పౌరులు ఉన్నారని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తుల మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఫ్యాక్టరీలోని రెండో అంతస్తు నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. . అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం వెంటనే తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో మొత్తం 102 మంది పనిచేస్తున్నారని కిమ్ తెలిపారు.
ఇలా ఉండగా విపత్తు నుండి ప్రాణనష్టాన్ని తగ్గించడానికి వ్యూహరచన చేయడానికి ప్రభుత్వం కేంద్ర విపత్తు మరియు భద్రత కౌంటర్‌మెజర్ హెడ్‌క్వార్టర్స్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా అంతర్గత మరియు భద్రత మంత్రి లీ సాంగ్-మిన్ అన్ని సంబంధిత ప్రభుత్వ సంస్థలు మంటలను ఆర్పడానికి. ప్రమాదంలో చిక్కుకున్న వారని కాపాడటానికి అందుబాటులో ఉన్న వనరులను,సిబ్బందిని మోహరించాలని కోరారు.