Site icon Prime9

South Korea: ఒక్క బిడ్డను కంటే 61 లక్షలు ఇస్తామంటున్న దక్షిణ కొరియా.. ఎందుకో తెలుసా?

South Korea

South Korea

South Korea: దేశంలో క్షీణిస్తున్న జనన రేటును పెంచే ప్రయత్నంలో జన్మించిన ప్రతి శిశువుకు తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకాలను చెల్లించాలని దక్షిణ కొరియా పరిశీలిస్తోంది.దక్షిణ కొరియా ప్రభుత్వ అవినీతి నిరోధక మరియు పౌర హక్కుల కమిషన్ దీనిని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తోంది.

ఈ సర్వేలో సంతానోత్పత్తి పెంచడానికి జంటలకు నగదు ప్రోత్సాహాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు అత్యధిక ప్రజలు మొగ్గు చూపారు. కొత్తగా జన్మనిచ్చిన పిల్లల తల్లిదండ్రులకు 72,491 డాలర్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే సంతానోత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ప్రస్తుతం పరోక్షంగా సహకరిస్తోంది. ఉదాహరణకు పుట్టిన బిడ్డలకు సబ్సిడీలతో పాటు పిల్లల సంరక్షణ ఖర్చులకు… దీంతో పాటు పేరెంటింగ్‌ సర్వీసెస్‌లపై కూడా సబ్సిడీలు ఇస్తోంది దక్షిణ కొరియా ప్రభుత్వం. అయితే పరోక్ష సబ్సిడీల ప్రభావం పెద్దగా పనిచేయకపోవడంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా నగదు ఇచ్చి ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉంది. కాగా ప్రభుత్వం సంతానోత్పత్తి పెంచడానికి ఇప్పటికే సుమారు 217.4 బిలియన్‌ డాలర్లు వ్యయం చేసింది. అయినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో పాలసీని మార్చాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా యాంటీ కరప్షన్‌, సివిల్‌ కమిషన్ ఈ నెల 17 నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పబ్లిక్‌ సర్వే నిర్వహించింది. ప్రజల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం కొత్తగా పుట్టిన బిడ్డల కుటుంబానికి 72,491 డాలర్లు (సుమారుగా 61 లక్షలు) ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ నెల 22 ఒక ప్రకటనలో తెలిపింది.

 పన్నులు ఉండవు..(South Korea)

నేషనల్‌ అసెంబ్లీ బడ్జెట్‌ ఆఫీస్‌ సమాచారం ప్రకారం 2006 నుంచి గత ఏడాది చివరి వరకు 18 సంవత్సరాల పాటు సుమారు 275.4 బిలియన్‌ డాలర్లు వ్యయం చేసినట్లు తెలిపింది. అయినా పెద్దగా ఫలితం కనిపించ లేదు. బర్త్‌రేటు 2006 నుంచి గత ఏడాది చివరి వరకు చూస్తే సరాసరి 1.13 నుంచి 0.72కు పడిపోయింది సుమారు 40 శాతం క్షీణించిందని తేలింది. క్రమంగా క్షీణిస్తున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. తాజాగా బూయంగ్‌ గ్రూపు ప్రవేశపెట్టిన వెల్ఫేర్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సిస్టమ్‌ ద్వారా పిల్లలు కన్న వారు ఉద్యోగి అయితే క్యాష్‌ ఇన్సెంటివ్‌ కింద 72,491 డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జంటకు మూడో సంతానం కలిగితే వారికి నగదు కావాలంటే నగదు.. లేదంటే ప్రభుత్వ గృహాల్లో అద్దె లేకుండా ఉచితంగా నివాసం ఉండవచ్చు అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. చైల్డ్‌ బర్త్‌ ఇన్సెంటివ్‌లపై ఎలాంటి పన్నులు విధించమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా కొత్త సిస్టమ్‌ దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యమవుతుందా … ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుందా అని తర్జన భర్జనలు పడుతోంది.

Exit mobile version
Skip to toolbar